Home

»

Latest News

మెగా హీరోల సంచలనం.. మూడంటే మూడే సినిమాలతో ఎంత రాబట్టారో తెలుసా!

Jun 11, 2026 4:49PM

 

 

-మెగా హీరోల సంచలనం 
-ప్రభావం చూపడం లేదనే అపవాదు నుంచి బయటకి 
-కోట్లు కొల్లగొట్టారు
-పూర్తి డీటెయిల్స్ చూద్దాం 


తెలుగు చలనచిత్రసీమలో మెగాఫ్యామిలీ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. కలెక్షన్స్ పరంగా దశాబ్దాల నుంచి బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సెట్ చేస్తు వస్తున్నారు.నిజానికి  గత కొంతకాలంగా టాలీవుడ్ పై తమ ప్రభావాన్ని చాటడంలో వెనకబడి ఉంది. కానీ అనూహ్యంగా పుంజుకొని  వరుస విజయాలతో దూసుకుపోతూ, థియేటర్ల వద్ద కలెక్షన్ల వర్షాన్ని కురిపిస్తున్నారు. 


ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం చిరంజీవి,  పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ నుంచి వచ్చిన ప్రీవియస్ మూవీస్ భారీ వసూళ్లు నమోదు చేయడంతో మెగా అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. ఒక్కో హీరో 300 కోట్లకి పైగా గ్రాస్ వసూళ్లు సాధించాడు. అంటే ముగ్గురిపై 900 కోట్లు రాబట్టారు. ఇంకా కలెక్షన్స్  రాబట్టే విషయంలో పెద్ది  ఆన్ డ్యూటీ లోనే ఉంది. ఏది ఏమైనా ఆ ముగ్గురు మెగా హీరోలు 900 కోట్లు రాబట్టడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. 2025లో విడుదలైన ఓజీ ద్వారా పవన్ కళ్యాణ్ అభిమానులకు సరికొత్త అనుభూతిని అందించారు. స్టైలిష్ యాక్షన్ అవతార్‌లో కనిపించిన పవన్, తన స్క్రీన్ ప్రెజెన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. యాక్షన్ ఎపిసోడ్స్, పవన్ లుక్, డైలాగ్స్ అభిమానుల్లో భారీ క్రేజ్‌ తీసుకువచ్చాయి. అందుకే 300 కోట్లకి పైగా గ్రాస్ వసూలు చేసి పవన్ కెరీర్‌లో ది బెస్ట్ గా నిలిచింది. ఇక మెగాస్టార్ నుంచి వచ్చిన  మన శంకర వరప్రసాద్ గారు సంక్రాంతి బరిలో విడుదలైంది. మెస్మరైజ్ చేసే చిరు యాక్టింగ్, డాన్స్ కి  300 కోట్లకి పైగా గ్రాస్ వసూళ్లు సాధించి సంక్రాంతి సీజన్‌లో భారీ విజయంగా నిలిచింది.

Also read: మహమ్మద్ సిరాజ్ ని పెళ్లాడనున్న స్టార్ హీరోయిన్!.. ఇదే సాక్ష్యం 


 పెద్ది ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. చరణ్ క్యారక్టర్ అభిమానులకి,  ప్రేక్షకులకి బాగా కనెక్ట్ అవుతుంది. భావోద్వేగ సన్నివేశాల్లో మంచి ప్రశంసలు లభిస్తున్నాయి. ఇప్పటికే .300 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించిన ఈ చిత్రం, త్వరలోనే 400 కోట్ల మార్క్‌ను అందుకునే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 

 

 

 


 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com