Home

»

Latest News

మోస్ట్ కాంప్లెక్స్ మైండ్: ‘వారణాసి’ కుంభకు మహేశ్ బర్త్‌డే విషెస్.!

Oct 16, 2026 3:42PM

సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శకుడు రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘వారణాసి’పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో మహేశ్‌తో పాటు కీలక పాత్రలో నటిస్తున్న పృథ్వీరాజ్ సుకుమారన్ పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం ప్రత్యేకంగా విషెస్ తెలిపింది. అంతేకాదు.. ఆయన పోషిస్తున్న కుంభ పాత్రను ‘మోస్ట్ కాంప్లెక్స్ మైండ్’ అంటూ అభివర్ణించింది. దీంతో ఈ పాత్రపై మరోసారి ఆసక్తి మొదలైంది.

‘వారణాసి’ అధికారిక సోషల్ మీడియా ఖాతా పృథ్వీరాజ్‌కు బర్త్‌డే విషెస్ తెలిపింది. ‘వారణాసి’లో అత్యంత సంక్లిష్టమైన ఆలోచనలున్న వ్యక్తి కుంభ అంటూ పోస్ట్ చేసింది. ఈ వ్యాఖ్యతో సినిమాలో పృథ్వీరాజ్ పాత్ర ఎలా ఉండబోతోందనే ఆసక్తి మరింత పెరిగింది.

ఇక పృథ్వీరాజ్ సుకుమారన్ పుట్టినరోజు సందర్భంగా మహేశ్ బాబు కూడా సోషల్ మీడియాలో ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. ‘హ్యాపీ బర్త్‌డే కుంభా.. అద్భుతమైన ఏడాది కావాలి.. ఎప్పుడూ ప్రేమ, ఆనందం ఉండాలి’ అంటూ విషెస్ చెప్పారు. ఈ సందర్భంగా పృథ్వీరాజ్‌ను ట్యాగ్ చేస్తూ హార్ట్ ఎమోజీలతో తన ప్రేమను వ్యక్తం చేశారు.

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘వారణాసి’లో మహేశ్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ప్రియాంక చోప్రా కథానాయికగా కనిపించనుండగా.. పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌లో మహేశ్ లుక్ అభిమానులను ఆకట్టుకుంది.

ఇప్పుడు కుంభ పాత్రను ‘మోస్ట్ కాంప్లెక్స్ మైండ్’ అంటూ చిత్రబృందం పేర్కొనడంతో.. పృథ్వీరాజ్ పాత్రలో ఎలాంటి మలుపులు ఉంటాయనే చర్చ మొదలైంది. ఆయన పాత్ర కథలో కీలకమైన మలుపులకు కారణమవుతుందా? మహేశ్ బాబుతో ఆయన తలపడే సన్నివేశాలు ఎలా ఉంటాయి? అనే ప్రశ్నలు అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి.

‘వారణాసి’ సినిమా కోసం మహేశ్ బాబు, రాజమౌళి తొలిసారి కలిసి పనిచేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌ను అంతర్జాతీయ స్థాయిలో రూపొందించేందుకు చిత్రబృందం ప్రయత్నిస్తోంది. టైమ్ ట్రావెల్, అడ్వెంచర్ అంశాలతో పాటు భారతీయ ఇతిహాస నేపథ్యం కూడా ఇందులో ఉండనుంది.

ఇది కూడా చదవండి: డ్రాగన్ సెట్స్‌లోకి ఎన్టీఆర్ రీఎంట్రీ.. 3 నెలల తర్వాత కెమెరా ముందుకు.!

 

 

 

[Varanasi Movie, Kumbha The Most Complex Mind, Prithviraj Sukumaran Birthday, Mahesh Babu Wishes, Kumbha Character, Prithviraj Sukumaran, SS Rajamouli, Mahesh Babu, Telugu Film News]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com