Home

»

Latest News

బ్రేకుల్లేవ్: ‘డ్రాగన్’ సెట్స్‌లోకి ఎన్టీఆర్ రీఎంట్రీ.. 3 నెలల తర్వాత కెమెరా ముందుకు.!

Oct 16, 2026 2:45PM

యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అప్‌డేట్ వచ్చేసింది. భుజానికి గాయం కావడంతో కొంతకాలంగా షూటింగ్‌కు దూరంగా ఉన్న తారక్.. తిరిగి కెమెరా ముందుకు వచ్చేశారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘డ్రాగన్’ షూటింగ్‌లో అక్టోబర్ 15న పాల్గొన్నట్లు సమాచారం. దీంతో ఈ సినిమా చిత్రీకరణ మళ్లీ వేగం పుంజుకోనుంది. ఇకపై వరుస షెడ్యూల్స్‌తో షూటింగ్‌ను పూర్తి చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.

ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘డ్రాగన్’పై మొదటి నుంచీ భారీ అంచనాలు ఉన్నాయి. ‘కేజీఎఫ్’, ‘సలార్’ సినిమాలతో తనదైన యాక్షన్ శైలిని చూపించిన ప్రశాంత్ నీల్.. ఈసారి తారక్‌ను సరికొత్త అవతారంలో చూపించబోతున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌లో ఎన్టీఆర్ లుక్ అభిమానుల్లో ఆసక్తిని పెంచింది.

అయితే షూటింగ్ సమయంలో ఎన్టీఆర్ భుజానికి గాయం కావడంతో శస్త్రచికిత్స చేయించుకోవాల్సి వచ్చింది. ఆగస్టు 12న ఆయనకు ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ జరిగింది. వైద్యుల సూచనల మేరకు విశ్రాంతి తీసుకుంటూ ఫిజియోథెరపీ కూడా చేశారు. దీంతో షూటింగ్‌కు కొంత విరామం ఏర్పడింది.

అయితే తారక్ షూటింగ్‌కు దూరంగా ఉన్నా.. ప్రశాంత్ నీల్ మాత్రం చిత్రీకరణను పూర్తిగా ఆపలేదు. ఎన్టీఆర్ అవసరం లేని సన్నివేశాలను ఇతర నటీనటులతో తెరకెక్కించారు. ఇప్పుడు తారక్ తిరిగి సెట్స్‌లోకి రావడంతో ఆయనకు సంబంధించిన కీలక సన్నివేశాల చిత్రీకరణపై దృష్టి పెట్టనున్నారు.

ఎన్టీఆర్ రీఎంట్రీతో ‘డ్రాగన్’ షూటింగ్ మళ్లీ జోరందుకోనుందని తెలుస్తోంది. మిగిలిన చిత్రీకరణను వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు వరుస షెడ్యూల్స్‌ను ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి షూటింగ్‌ను పూర్తి చేయాలనే లక్ష్యంతో చిత్రబృందం ముందుకు వెళ్తున్నట్లు సమాచారం. ఈ సినిమా జూన్ 11, 2027న ప్రేక్షకుల ముందుకు రానుంది.

మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో రుక్మిణి వసంత్ కథానాయికగా నటిస్తోంది. అనిల్ కపూర్, బిజూ మీనన్, అశుతోష్ రాణా, ఖుష్బూ సుందర్, అంషుమాన్ పుష్కర్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.

ఇది కూడా చదవండి: రామ్ చరణ్ నుంచి ఎన్టీఆర్ వరకు.. బాలీవుడ్ మేకర్స్‌కు నో చెబుతున్నారా.?

 

 

 

[Jr NTR Returns to Dragon Sets, Dragon Release Date, Jr NTR Dragon Movie, Dragon Movie Update, Jr NTR Comeback, NTR Neel Movie, Jr NTR, Prashanth Neel, Rukmini Vasanth, Telugu Film News]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com