
ప్రముఖ హీరోయిన్ ఇంద్రజ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి ప్రాముఖ్యత గల క్యారెక్టర్స్ ని పోషిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే విక్రమ్ సహిదేవ్, సంధ్య హీరో, హీరోయిన్స్ గా చేసిన 'అనకాపల్లి' లో హీరో తల్లిగా చేసి మెప్పిస్తుంది. ఈ సినిమా వేడుకలో నిర్మాత లగడపాటి శ్రీధర్ వేదికపై ప్రసంగిస్తూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్రంగా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా సీనియర్ నటి ఇంద్రజ గురించి ఆయన మాట్లాడిన భావోద్వేగ మాటలు ప్రతి ఒక్కరి హృదయాలను తాకుతున్నాయి.
సినిమా పరిశ్రమలో దశాబ్దాల తరబడి నటిగా రాణిస్తున్న ఇంద్రజ గారు కేవలం ఒక గొప్ప కళాకారిణి మాత్రమే కాదని, ఆమె మంచితనం, వృత్తిపట్ల ఉన్న క్రమశిక్షణ ఎందరికో ఆదర్శమని శ్రీధర్ కొనియాడారు. 100 శాతానికి పైగా డెడికేషన్‌తో పనిచేసే నటులు టాలీవుడ్‌లో చాలా అరుదుగా ఉంటారని, అలాంటి వారిలో ఇంద్రజ ముందంజలో ఉంటారని ఆయన వ్యాఖ్యానించారు. సెట్స్‌లో ఆమె చూపించే సహనం, తోటి నటీనటులకు ఇచ్చే గౌరవం అభినందనీయమని చెప్పారు. 'అనకాపల్లి' సినిమాలో ఇంద్రజ చేసిన పాత్ర ప్రేక్షకులను కట్టిపడేస్తుందని, ఆమె నటన ఈ చిత్రానికి ప్రధాన బలమని స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూడే.. ఓటిటి డేట్ ఇదే!
.webp)
నటులకి కేవలం గ్లామర్ మాత్రమే కాదు, గుండెల్లోంచి వచ్చే భావోద్వేగాలే శాశ్వత గుర్తింపును ఇస్తాయని అన్నారు. గత 20 ఏళ్లకు పైగా తాను సినీ రంగంలో కొనసాగుతున్నానని, ఈ ప్రయాణంలో వందలాది మంది నటీనటులతో పనిచేసే అవకాశం లభించిందని గుర్తు చేసుకున్నారు. కానీ ఇంద్రజ లాంటి నటీమణులు లభించడం ఈ చిత్రబృందానికి దక్కిన గొప్ప అదృష్టమని ఆయన ఎమోషనల్ అయ్యారు. సినిమా షూటింగ్ సమయంలో ఎదురైన సవాళ్లను దాటుకుంటూ, తమ యూనిట్ సభ్యులందరూ రోజుకు 14 నుంచి 16 గంటల పాటు శ్రమించి ఈ చిత్రాన్ని పూర్తి చేశారని ఆయన వెల్లడించారు.
అంతే కాకుండా గతంలో చెన్నై ఎయిర్ పోర్ట్ లో వృద్ధాప్యంలో ఉన్న నా తండ్రిని చిన్న బాబు లాగా చేసుకుందని కన్నీటి పర్యంత మయ్యారు. లగడపాటి శ్రీధర్ కొడుకునే హీరో విక్రమ్ సహిదేవ్.
[Lagadapati Sridhar Emotional Comments On Actress Indraja, Lagadapati Sridhar, Actress Indraja, Anakapalli Movie, TeluguCinema News, Tollywood Cinema News, Tollywood, TeluguCinema]





