TeluguOne App Promotion
● # Tweets

Home

»

తాజా

నాగార్జున,చైతు మధ్య బిగ్ ఫైట్ తప్పదా!

Nov 26, 2024 10:26AM

ఇండియన్ సిల్వర్ స్క్రీన్ వద్ద తెరకెక్కుతున్నబిగ్గెస్ట్ మల్టీస్టారర్స్ లో నాగార్జున(nagarjuna)ధనుష్(dhanush)ల పాన్ ఇండియా మూవీ 'కుబేర'(kubera)కూడా ఒకటి.నేషనల్ క్రష్ రష్మిక (rashmika)హీరోయిన్ గా చేస్తున్న ఈ మూవీలో జిమ్ సర్బ్,దలిప్ తహిల్ వంటి మేటినటులు ముఖ్యపాత్రల్లో చేస్తున్నారు.విభిన్న చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల(sekhar kammula) ఫస్ట్ టైం ఇద్దరు బిగ్ స్టార్స్ తో చేస్తుండటంతో కుబేరపై అభిమానులతో పాటు,ప్రేక్షకుల్లో కూడా ఎంతో ఆసక్తి నెలకొని ఉంది.శ్రీ వెంకటేశ్వర ఎల్ఎల్ పి పతాకంపై సునీల్ నారంగ్, రామ్ మోహన్ రావు అత్యంత భారీవ్యయంతో నిర్మిస్తున్న ఈ మూవీ ఇప్పుడు రిలీస్ డేట్ ని లాక్ చేసుకుందనే వార్తలు వస్తున్నాయి.

నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి రెండో వారంలో కుబేర ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే యోచనలో మేకర్స్ ఉన్నారని తెలుస్తుంది.ఈ మేరకు త్వరలోనే అధికార ప్రకటన రానుందని కూడా  అంటున్నారు.మూవీ అయితే ప్రస్తుతానికి ముగింపు దశలో ఉంది ఇప్పటికే రిలీజైన నాగ్, ధనుష్, రష్మిక పాత్రలకి సంబంధించిన మూడు టీజర్స్ కూడా 'కుబేర'పై అందరిలో క్యూరియాసిటీని కలగ చేస్తుంది.ట్రైలర్ కూడా సంక్రాంతి తర్వాత రిలీజ్ చేస్తారనే టాక్ కూడా ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతుంది.

మరి 'కుబేర' కనుక రెండో వారం కన్ఫార్మ్ చేసుకుంటే, నాగ్ తన కొడుకు నాగ చైతన్య(naga chiatanya)తో పోటీ పడాల్సి ఉంటుంది.ఎందుకంటే చైతన్య కెరీర్లోనే ప్రెస్టేజియస్ట్ మూవీగా రూపుదిద్దుకుంటున్న తండేల్ వరల్డ్ వైడ్ గా ఫిబ్రవరి 7 న రిలీజ్ అవుతుంది.ఈ మేరకు అధికార ప్రకటన కూడా వచ్చింది మరి రెండోవారంలోనే కుబేర కూడా రిలీజ్ అయితే నాగ్, చైతు ల పోటీ తప్పదనే కామెంట్స్ సినీ సర్కిల్స్ లో వినపడుతున్నాయి.తండేల్ ని గీతాఆర్ట్స్ పై అల్లు అరవింద్(allu aravind)నిర్మిస్తున్న విషయం తెలిసిందే.

 

google-ad-img