
కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తూ.. తొలిసారి మెగాఫోన్ పట్టిన సినిమా ‘రియాలిటీ’. ఇంతకుముందు #KA13గా ప్రచారంలో ఉన్న ఈ సినిమాకు ‘రియాలిటీ’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు. తాజాగా మేకర్స్ టైటిల్ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు.
గ్లింప్స్ చూస్తే.. ఇందులో కిరణ్ అబ్బవరం 'ఆనందం' అనే సాధారణ మధ్యతరగతి యువకుడిగా కనిపిస్తున్నాడు. ఓ హోటల్‌ను నడుపుకుంటూ కుటుంబాన్ని చూసుకునే పాత్రలా తెలుస్తోంది. అయితే ఈ పాత్రకు సంబంధించిన అసలు హైలైట్ మాత్రం 'కుటుంబ అప్పులు తీర్చడం'.
“ఈ రోజుటితో నాకు కానీ, నా కుటుంబానికి కానీ ఒక్క రూపాయి కూడా అప్పు లేదు. నాలాంటోడికి ఇంతకు మించిన హై మూమెంట్ ఏముంటుంది?” అనే డైలాగ్ గ్లింప్స్‌లో బాగా వర్కౌట్ అయ్యింది. అప్పులు తీర్చిన తర్వాత వచ్చే ఆనందాన్ని ఇంత సింపుల్‌గా చూపించడం.. మధ్యతరగతి ప్రేక్షకులకు ఈజీగా కనెక్ట్ అయ్యే పాయింట్.
ఇక గ్లింప్స్‌లో పెద్ద యాక్షన్ బ్లాక్స్, భారీ ఎలివేషన్స్ కాకుండా.. రోజువారీ జీవితంలోని చిన్న చిన్న ఆనందాలను చూపించారు. కుటుంబ సభ్యులతో కలిసి వడియాలు చేసుకోవడం, ఇంట్లో సరదాగా గడపడం లాంటి సీన్లు కనిపిస్తున్నాయి.
‘రియాలిటీ’ అనే టైటిల్ కు తగ్గట్టుగానే.. సినిమా కూడా నిజ జీవితానికి దగ్గరగా ఉండే అంశాలను చూపించబోతున్నట్టుగా గ్లింప్స్‌తో హింట్ ఇచ్చారు.
బ్యాక్‌గ్రౌండ్‌లో భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ కూడా ఈ ఫ్యామిలీ ఎమోషన్‌కు తగ్గట్టుగానే ఉంది. ముఖ్యంగా ‘భజ గోవిందం’ను ఉపయోగించిన విధానం గ్లింప్స్‌కు ప్రత్యేకమైన ఫీల్ తీసుకొచ్చింది.
సుధాకర్ చాగంటి నిర్మిస్తున్న ఈ సినిమాలో దేవిక భట్ హీరోయిన్‌గా నటిస్తోంది. శరత్ కుమార్, సాయికుమార్, రోహిణి, అన్నపూర్ణమ్మ వంటి సీనియర్ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
అయితే ‘రియాలిటీ’కి మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. బాలకృష్ణ ‘దాదా’, నాగార్జున ‘కింగ్ 100’ సినిమాలతో పాటు ఈ సినిమా కూడా క్రిస్మస్ బరిలోకి దిగుతోంది.
ఇది కూడా చదవండి: పొలిటికల్ హీట్.. రాజకీయాల్లోకి వస్తున్న మరో స్టార్ హీరో.!
[Reality Title Glimpse, Kiran Abbavaram Reality Movie, Reality Glimpse, Kiran Abbavaram, Reality Movie, Nandamuri Balakrishna, Dada Movie, Akkineni Nagrjuna, King 100 Movie, Telugu Film News]






