Home

»

Latest News

Toxic: టాక్సిక్ లోని బోల్డ్ సీన్స్ పై సంచలన రిప్లై ఇచ్చిన కియారా అద్వానీ 

May 05, 2026

 

యష్(Yash)వన్ మాన్ షో 'టాక్సిక్'(Toxic)న్యూస్ రాని రోజు  సోషల్ మీడియాకి వాల్యూనే లేదు అనే రీతిలో డైలీ నెట్టింట 'టాక్సిక్' హంగామా కొనసాగుతూనే ఉంది. ఈ సారి అందుకు కారణంగా అందాల తార కియారా అద్వానీ(Kiara Advani)నిలిచింది. యష్ కి జతగా కియారా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ఇద్దరికి సంబంధించి వచ్చిన స్టిల్స్ కూడా అభిమానులు, మూవీ లవర్స్ గుండెల్లో టాక్సిక్ ని భద్రంగా ఉంచుతున్నాయి. కానీ కొన్ని రోజులుగా టాక్సిక్ విషయంలో  కియారా తన రొమాన్స్ సన్నివేశాలని తొలగించమందనే న్యూస్ వైరల్ గా మారింది. ఇప్పుడు ఆ న్యూస్ కి  వైరల్ అవ్వడానికి ఎలాంటి అర్హత లేదనే విషయం అర్దమవుతుంది. ఆ డీటెయిల్స్ చూద్దాం

 సదరు న్యూస్ పై  కియారా టీమ్ స్పందిస్తూ ఆ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదు. కేవలం వ్యూస్ కోసం సృష్టించిన తప్పుడు ప్రచారాలవి. కియారా ఎప్పుడూ కథకి ప్రాధాన్యత ఉన్న క్యారక్టర్ లనే  ఎంచుకుంటుంది. అర్థం లేని బోల్డ్ సీన్స్ వార్తలని నమ్మకండి. కథ ప్రకారం కియారా అద్వానీ కొన్ని బోల్డ్ సన్నివేశాల్లో చేసిందని,  భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేసిందనే వార్తలు కూడా వస్తున్నాయి. వాటిని సైతం నమ్మద్దు. స్క్రిప్ట్ డిమాండ్ చేయని ఏ సన్నివేశంలోను  కియారా చేయలేదని కన్ఫర్మ్ చేసారు. 

Also read: Sandeep Reddy Vanga: విజయ్‌ గెలుపుపై సందీప్ రెడ్డి వంగా కీలక వ్యాఖ్యలు.. సినిమా పవర్ అంటే ఇదేనా!

మహిళా దర్శకురాలు గీతూ మోహన్ దాస్(Geetu Mohandas)తెరకెక్కించిన టాక్సిక్ ఎందుకనో రిలీజ్ విషయంలో తర్జన భర్జన పడుతుంది. ఈ విషయంలో కూడా పలు రకాల పుకార్లు వినిపిస్తున్నా పుకార్లని నమ్మకూడదని అభిమానులు, సినీ ప్రియులు ఫిక్స్ అయ్యారు. ఎందుకంటే అక్కడ ఉంది ప్యూర్  పాన్ ఇండియా కట్ అవుట్ యష్. డ్రగ్ మాఫియా నేపథ్యంలో టాక్సిక్ తెరకెక్కింది.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com