Home

»

Latest News

హీరోయిన్ అంటే ఇదే: కయదు లోహర్ కి అన్యాయం జరిగిందా!

Sep 24, 2026 1:05PM

 

 

నిన్న ప్రీమియర్స్ నుంచే థియేటర్స్ లోకి వచ్చిన  నేచురల్ స్టార్ నాని వన్ మాన్ షో 'ది ప్యారడైజ్' కి హీరోయిన్ అంటే అంత ఎగతాళిగా ఉందా అనే విమర్శలు మూవీ చూసిన ప్రేక్షకుల నుంచి వ్యక్తమవుతున్నాయి. 

పోస్టర్లు, ప్రచార చిత్రాలలో కయదు లోహార్‌ ని ఒక రేంజ్ లోనే ప్రమోట్ చేసిన చిత్ర బృందం, మూవీలో మాత్రం  చాలా పరిమితమైన స్క్రీన్ ప్రెజెన్స్ మాత్రమే ఇచ్చిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలు చనిపోయిన తండ్రి చేసిన అప్పు తీర్చి తన తండ్రి పరువు కాపాడాలనుకునే యువతి, బి గ్రేడ్ షార్ట్ ఫిలిమ్స్ లో ఒంటితో వ్యాపారం చేసి ఆ డబ్బుతో తండ్రి అప్పు తీరిస్తే, తన తండ్రి ఆత్మ సంతోషపడుతుందా! ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబ నేపథ్యంలో ఆమె క్యారెక్టర్‌ని  చూపించినప్పటికీ, దానిని కేవలం కథా గమనానికి అదనపు అంశంగా మాత్రమే ఉంచారు తప్ప, సరైన భావోద్వేగ ముగింపు ఇవ్వలేదు. చిత్రం మొదటి భాగంలో కొద్దిసేపు కనిపించే ఆమె క్యారక్టర్ సెకండ్ హాఫ్ లో  అసలు ప్రాధాన్యతే లేనట్లుగా మారిపోతుంది. ప్రతిభావంతురాలైన నటి అయినప్పటికీ, కయాదు లోహార్‌ని కేవలం గ్లామర్ అట్రాక్షన్ కోసం లేదా పోస్టర్ ప్రమోషన్ల కోసమే వాడుకున్నారనే అభిప్రాయం ప్రేక్షకుల నుంచి వ్యక్తమవుతోంది.

ఇది కూడా చదవండి: రికార్డు కలెక్షన్స్: ప్రీమియర్స్ తో కలుపుకొని ఎంతంటే !

 

పైగా క్యారక్టర్ కి ఇంపార్టెంట్ కూడా ఇవ్వలేదు.విడుదలకి ముందు జరిగిన మీడియా సమావేశాల్లో కయదు మాట్లాడుతూ, తన క్యారక్టర్ ఎంతో కీలకమని, ఎన్నో సర్‌ప్రైజ్‌లు ఉంటాయని చెప్పుకొచ్చింది. కానీ తీరా థియేటర్లలో చూస్తే, 2 గంటల 54 నిమిషాల నిడివి ఉన్న ఈ సుదీర్ఘ చిత్రంలో ఆమె రోల్  కేవలం కొన్ని నిమిషాలకే పరిమితం. సినిమా యొక్క అసలు కథ అంతా కథానాయకుడి ప్రతీకారం, తల్లి-కొడుకుల సెంటిమెంట్, విలనిజం చుట్టూనే తిరుగుతుంది. కథను ముందుకు నడిపించడంలో లేదా క్లైమాక్స్ మలుపులలో ఆమె పాత్రకు ఎలాంటి ప్రభావవంతమైన ప్రాధాన్యత లభించకపోవడం గమనార్హం.  హీరోయిన్ అంటే కేవలం రెండు పాటలు, కొన్ని రొమాంటిక్ సీన్లకే పరిమితం కాకుండా, కథలో కీలక పాత్ర పోషించే విధంగా క్యారెక్టర్లను డిజైన్ చేయాలని అభిమానులు, నెటిజన్లు కోరుకుంటున్నారు. ఏది ఏమైనా కయదుకి నానితో ఒక డ్యూయట్ సాంగ్ కూడా లేదు. 

 

 

[Kayadu Lohar Role In The Paradise Movie, The Paradise Collections, The Paradise Movie Review Telugu, Nani, Telugu Cinema, telugu Cinema News, Tollywood, Tollywood News]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com