Home

»

Latest News

Allu arjun: అల్లు అర్జున్ పై కావేరి కీలక వ్యాఖ్యలు.. నమ్మొచ్చా ఆ మాటలు 

Feb 10, 2026

 

-ఎవరు ఈ కావేరి
-ఆమె ఏం చెప్తుంది
-ఫ్యాన్స్ ఏమంటున్నారు

 

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun)ప్రస్తుతం 'అట్లీ'(Atlee)దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. సదరు చిత్రంలోని అల్లు అర్జున్ నట విన్యాసాన్ని చూడాలంటే  నెక్స్ట్ ఇయర్ వరకు ఆగాల్సిందే. అల్లు అర్జున్ సినిమాల పరంగానే కాకుండా యాడ్స్ లోను తనదైన మెస్మరైజ్ ని చూపిస్తూ అభిమానులని, కస్టమర్స్ ని ఆకర్షిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. ఈ యాడ్స్ విషయంలో అల్లు అర్జున్ గురించి  రాయల్ ఎన్ ఫీల్డ్  బ్రాండ్ స్ట్రాటజీ విభాగం మేనేజర్ 'కావేరి బారువా'(kaveri Baruah) చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. మరి ఆమె ఏం మాట్లాడిందో చూద్దాం.

అల్లు అర్జున్ లాంటి స్టార్ తో యాడ్ షూటింగ్ అంటే ఖచ్చితమైన నిబంధనలు ఉంటాయి. షేక్ హ్యాండ్ ఇవ్వకూడదు. కళ్ళలోకి చూడకూడదు. తగిన దూరం పాటించాలి. ఆయన ముందు ఫోన్ మాట్లాడకూడదు.ఒకసారి ఎక్కడో దూరంగా ఫోన్ చూస్తూ కూర్చున్నాను. అల్లు అర్జున్ గారి బాడీ గార్డ్ పరుగెత్తుకుంటూ వచ్చి ఫోన్ లాక్కొన్నాడు.  హీరో ప్రైవసీ కి భంగం కలిగించకూడదని ఆ విధంగా చేసి ఉండవచ్చు. అల్లు అర్జున్ ని కలిసిన తర్వాత ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదు అనే విషయాలని కూడా ముందుగానే చెప్తారు. ఈ విషయంలో మేనేజర్లు చాలా కఠినంగా ఉంటారని కావేరి చెప్పుకొచ్చింది. మరి ముందు ముందు అల్లు ఆర్మీ ఆమె మాటలకి ఎలాంటి సమాధానం ఇస్తుందో చూడాలి.


Also read:  ఏది ముందు, ఏది తర్వాత.. నితిన్ డబుల్ యాక్షన్ చేస్తున్నాడా!

కావేరి బారువా యాడ్స్ రంగంలో సుదీర్ఘ కాలం నుంచి రాణిస్తూ వస్తుంది. ఇదే ఇంటర్వ్యూ లో మరికొంత మంది సెలబ్రటిస్ పై కూడా యాడ్స్ షూటింగ్  కి సంబంధించి ఎలా ఉంటారో చెప్పింది. ప్రస్తుతం ఆమె పాడ్ కాస్ట్ ప్రోగ్రాం వైరల్ గా మారింది.

      

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com