TeluguOne App Promotion
● # Tweets

Home

»

తాజా

ఆస్కార్ బరిలో తెలుగు అమ్మాయి సినిమా: తెలుగు వీర లేవరా! మద్దతు ఇవ్వండి

Nov 27, 2026 4:12PM


అమ్మాయిలే కదా అని తీసిపారెయ్యకండి. అందులోను తెలుగు అమ్మాయిలు. ఆస్కార్ దాకా వెళ్తారు. ఏంటి ఆస్కార్ నా అని షాక్ అయ్యారా. అదుర్స్ లో చారి( బ్రహ్మానందం) అన్నట్టుగా  అంత షాక్ ఎందుకు ఆస్కార్ నే. మరి డీటెయిల్స్ చూసెయ్యండి


తెలుగు అమ్మాయి తెరకెక్కించిన ఓ చిన్న సినిమా ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కన్నడ, తెలుగు భాషల్లో రూపొందిన ‘పంకజ’ కేవలం సినిమా పండగల్లో ప్రశంసలు అందుకోవడమే కాదు.. ఆస్కార్ బరిలో నిలిచే అర్హతను కూడా సాధించింది. మరో విశేషం ఏంటంటే. హాలీవుడ్ దిగ్గజాలు స్పైక్ లీ, విల్లెమ్ డాఫో అండగా నిలవడం!పంకజ’కి దర్శకత్వం వహించింది అనూయా స్వామి. న్యూయార్క్ యూనివర్సిటీ (NYU)లో ఫిల్మ్ మేకింగ్ చదువుతున్న సమయంలో ఆమె రెండో ఏడాది ప్రాజెక్ట్‌గా ఈ చిత్రాన్ని రూపొందించారు. బెంగళూరులో పుట్టి పెరిగిన అనూయా.. తనకు తెలిసిన జీవితాలు, తన చుట్టూ చూసిన మనుషుల కథలని  తెరపైకి తీసుకొచ్చారు.

ఈ సినిమా రేన్‌డాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ లైవ్ యాక్షన్ షార్ట్ అవార్డును గెలుచుకోవడంతో 99వ ఆస్కార్ అవార్డుల పరిశీలనకు అర్హత సాధించింది. అంతకుముందు సన్‌డాన్స్ సహా పలు అంతర్జాతీయ చిత్రోత్సవాల్లోనూ ప్రదర్శితమై గుర్తింపు తెచ్చుకుంది.

 

కథ ఏంటంటే?

బెంగళూరులోని మురికివాడల నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతుంది. పంకజ అనే మహిళ తన భర్త కనిపించకుండా పోవడంతో.. చిన్న కూతురు లల్లితో కలిసి అతడి కోసం వెతుకుతూ ఉంటుంది. ఈ ప్రయాణంలో పేదరికం, అధికార వ్యవస్థలోని సమస్యలు, సామాన్యుల కష్టాలు, తల్లీకూతుళ్ల అనుబంధం వంటి అంశాలను దర్శకురాలు చూపించారు.

ఇది కూడా చదవండి: శ్రీకాంత్ చెల్లెలు తెలుగులో ఫేమస్ నటి.. స్టార్ హీరోలతో సినిమాలు.. తెలుసా ఆమె ఎవరో!

పంకజ పాత్రలో హర్షిణి బోయళ్ల నటించగా.. చిన్నారి లల్లి పాత్రలో పద్మశ్రీ కనిపించారు. కేవలం 14 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా.. చిన్న కథలోనే బలమైన భావోద్వేగాలను పలికించే ప్రయత్నం చేసింది.

హాలీవుడ్ దిగ్గజాల మద్దతు

‘పంకజ’కు ఇప్పుడు హాలీవుడ్ నుంచి కూడా అండ లభించింది. ప్రముఖ దర్శకుడు స్పైక్ లీ, నటుడు విల్లెమ్ డాఫో ఈ సినిమాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్లుగా వ్యవహరిస్తున్నారు. ఆస్కార్ అవార్డు గెలుచుకున్న భారతీయ నిర్మాత గునీత్ మోంగా కపూర్ కూడా ఈ ప్రాజెక్టులో భాగమయ్యారు.

స్పైక్ లీతో అనూయాకు ప్రత్యేక అనుబంధం ఉంది. ఆమె NYUలో చదువుతున్న సమయంలో ఆయనకు టీచింగ్ అసిస్టెంట్‌గా పనిచేశారు. ఇప్పుడు అదే స్పైక్ లీ తన సినిమాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా ఉండటం ఆమెకు ఎంతో ప్రత్యేకమైన అనుభవం.

 

తెలుగు అమ్మాయిల ప్రతిభకు అంతర్జాతీయ గుర్తింపు

ఈ సినిమాకు మరో ప్రత్యేకత కూడా ఉంది. దర్శకురాలు అనూయా స్వామి, ప్రధాన పాత్రధారి హర్షిణి బోయళ్ల ఇద్దరూ తెలుగు మాట్లాడే అమ్మాయిలే. బెంగళూరులో పుట్టి పెరిగిన వీరు తెలుగు, కన్నడ సంస్కృతుల మధ్య పెరిగారు. ఆ అనుభవమే ఈ ద్విభాషా చిత్రానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపును తీసుకొచ్చింది.

ఇప్పటికే 40కి పైగా అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రదర్శితమైన ‘పంకజ’.. ఇప్పుడు ఆస్కార్ ప్రచారంలో ఉంది. అయితే ఆస్కార్‌కు అర్హత సాధించడం, తుది నామినేషన్ దక్కించుకోవడం రెండూ వేర్వేరు దశలు. మరి ఈ చిన్న సినిమా ఆస్కార్ ప్రయాణంలో ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి!

 

మీకు నచ్చవచ్చు

వెంకటేశ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్!

మైత్రి మూవీ మేకర్స్ భారీ స్కెచ్!

 

 

[pankaja, Guneet Monga, Harshini Boyalla, oskar]

 

google-ad-img