Home

»

Latest News

Ranya Rao: వన్ ఇయర్ తర్వాత  జైలు నుంచి రిలీజైన ప్రముఖ హీరోయిన్.. ఫ్యాన్స్ డాన్సులు 

Apr 23, 2026

 

ఎంత డబ్బు ఇచ్చినా, సైన్ చేసిన ఖాళీ చెక్కుల ఇచ్చినా అభిమానులు మాత్రం వాటిని పట్టించుకోకుండా బాధల్లో ఉన్న తమ అభిమాన నటుడో, నటి గురించే ఆలోచిస్తారు. ఇదే కోవలో ఏడాది క్రితం అక్రమ బంగారం రవాణా కేసులో అరెస్ట్ అయిన  తమ అభిమాన నటి రన్యారావు(Ranya Rao)కోసం ఎంతగానో ఆలోచిస్తూ ఉన్నారు. ఇప్పుడు వాళ్లందరికీ గుడ్ న్యూస్.


మొన్న రన్యారావు బెయిల్ పై జైలు నుంచి పరప్పన అగ్రహార జైలు నుంచి రిలీజ్ అయ్యింది. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే రన్యారావుపై కేసు నమోదు చేసిన డిఆర్ఐ అలియాస్ డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటిలిజెన్స్  రన్యారావు పై ఉన్న కేసు పొడిగించాలని ఎలాంటి పిటిషన్ చెయ్యలేదు. దీంతో రూల్స్ ప్రకారం రన్యారావుకి బెయిల్ లభించింది.


Also read: Varanasi: మెక్సికో దేశంలో వారణాసి ప్రదర్శన.. ఇది ఎవరి పని 


జైలు నుండి బయటకు వచ్చిన రన్యారావుకి  కుటుంబ సభ్యులు, సన్నిహితులు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె తీవ్ర భావోద్వేగానికి లోనవ్వడంతో పాటు మీడియా ప్రతినిధులు పలరించడానికి ప్రయత్నించినప్పటికీ ఎటువంటి వ్యాఖ్యలు చేయకుండానే వెళ్లిపోయారు. గత సంవత్సరం మార్చి 3 న బెంగుళూర్ ఎయిర్ పోర్ట్ లో రన్యారావు అరెస్ట్ అవ్వగా ఆ సమయంలో ఆమె దగ్గర 14 . 2 కేజిల బంగారం దొరికింది. అదంతా అక్రమ రవాణానే. ఆ విధంగా పలు దఫాలుగా 127 కిలోల బంగారాన్ని రవాణా చేసినట్టుగా టాక్.  మాణిక్య, పటకి, వాగ వంటి చిత్రాల్లో చేసింది
 

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com