
బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ కంగనా రనౌత్.. టాలీవుడ్లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నారా? అదీ మన తెలుగు దర్శకుడు రవిబాబు తెరకెక్కించే హారర్ సినిమాతోనా? ప్రస్తుతం ఇండస్ట్రీలో ఇదే ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. రవిబాబు ఓ హారర్ మూవీ చేస్తున్నారని, ఇందులో కంగనా రనౌత్ నటిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. అంతేకాదు.. ఈ సినిమా షూటింగ్ కూడా రహస్యంగా జరుగుతోందనే టాక్ వినిపిస్తోంది.
తెలుగులో విభిన్నమైన కథలు, ప్రయోగాత్మక సినిమాలకు పెట్టింది పేరు దర్శకుడు రవిబాబు. ‘అల్లరి’, ‘అనసూయ’, ‘అవును’ వంటి సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా హారర్, థ్రిల్లర్ కథలను ఆయన తెరకెక్కించే విధానం ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగిస్తుంది.
ఇప్పుడు అలాంటి రవిబాబు.. కంగనా రనౌత్‌తో ఓ హారర్ సినిమా చేయబోతున్నారన్న వార్త హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమాలో కంగనా ప్రధాన పాత్ర పోషిస్తున్నారని సమాచారం. అయితే కథేంటి? ఆమె పాత్ర ఎలా ఉండబోతోంది? ఈ సినిమాను ఎవరు నిర్మిస్తున్నారు? అనే వివరాలు మాత్రం బయటకు రాలేదు.

కంగనా రనౌత్ తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమే. ప్రభాస్ నటించిన ‘ఏక్ నిరంజన్’ సినిమాలో ఆమె హీరోయిన్ గా నటించారు. 2009లో విడుదలైన ఈ సినిమా తర్వాత ఆమె మళ్లీ నేరుగా తెలుగు సినిమాలో నటించలేదు. ఆ తర్వాత బాలీవుడ్లో వరుస సినిమాలతో స్టార్ నటిగా ఎదిగారు.
ఇప్పుడు రవిబాబు సినిమా వార్తలు నిజమైతే.. దాదాపు 17 ఏళ్ల విరామం తర్వాత కంగనా మళ్లీ టాలీవుడ్లో కనిపించే అవకాశం ఉంది. అందులోనూ హారర్ జానర్ కావడం మరో విశేషం.
ప్రస్తుతం కంగనా రనౌత్ చేతిలో ‘క్వీన్ 2’, ‘తను వెడ్స్ మను 3’, ‘సర్కిల్’ వంటి ప్రాజెక్టులు ఉన్నాయి. మరోవైపు రాజకీయాల్లోనూ ఆమె చురుగ్గా వ్యవహరిస్తున్నారు.
ఇలాంటి సమయంలో రవిబాబుతో తెలుగు సినిమా చేయబోతున్నారన్న ప్రచారం ఆసక్తిని పెంచుతోంది. నిజంగానే ఈ కాంబినేషన్ సెట్ అయితే.. కంగనా అభిమానులకు మాత్రమే కాదు, హారర్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు కూడా ఇది ఆసక్తికరమైన వార్తే.
ఇది కూడా చదవండి: అసలు టార్గెట్ ఆమిర్ ఖాన్.. టైగర్ ష్రాఫ్‌పై కాల్పుల కేసులో సంచలన విషయాలు.!
[Kangana Ranaut Tollywood Re Entry, Kangana Ranaut Tollywood Comeback, Kangana Ranaut Ravi Babu Movie, Kangana Ranaut Telugu Movie, Kangana Ranaut Horror Film, Kangana Ranaut, Ravi Babu, Prabhas, Telugu Film News]






