
బాలీవుడ్‌లో మరోసారి గ్యాంగ్‌స్టర్ల బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. టైగర్ ష్రాఫ్ కారుపై కాల్పుల ఘటనలో రోజుకో సంచలన విషయం బయటకు వస్తోంది. తాజాగా ఈ కేసులో అసలు టార్గెట్ టైగర్ ష్రాఫ్ కాదని.. బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ అని పోలీసుల దర్యాప్తులో వెల్లడైనట్లు సమాచారం. ఆమిర్‌ను చేరుకోవడం కష్టంగా మారడంతోనే నిందితులు తమ ప్లాన్ మార్చుకుని టైగర్ ష్రాఫ్ ను టార్గెట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
దీంతో అసలు ఆమిర్ ఖాన్‌ను ఎందుకు టార్గెట్ చేయాలనుకున్నారు? టైగర్ ష్రాఫ్ పై కాల్పుల వెనుక ఎవరున్నారు? అనే ప్రశ్నలు ఇప్పుడు బాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారాయి.
అక్టోబర్ 18న ముంబైలోని జుహూ ప్రాంతంలో టైగర్ ష్రాఫ్ కారుపై కాల్పులు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్న ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు కీలక విషయాలు తెలిసినట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
ఈ కేసులో నిందితులుగా ఉన్న ఫూల్ సింగ్, రెహాన్ అన్సారీలు హర్యానా నుంచి ముంబైకి వచ్చి.. ఆమిర్ ఖాన్ నివాసం పరిసరాల్లో పలుమార్లు రెక్కీ నిర్వహించినట్లు తెలుస్తోంది. ఆమిర్ ఇంటి దగ్గర కనీసం మూడుసార్లు సంచరించినట్లు సమాచారం.
అయితే ఆమిర్ ఖాన్ తరచూ సినిమా షూటింగ్స్ కోసం బయటకు వెళ్లడం లేదా ఇంట్లోనే ఎక్కువ సమయం ఉండటంతో ఆయనను చేరుకోవడం కష్టమైందట. దీంతో తమ ప్లాన్‌ను మార్చుకున్న నిందితులు.. టైగర్ ష్రాఫ్ ను లక్ష్యంగా చేసుకున్నట్లు దర్యాప్తు వర్గాలు వెల్లడించినట్లు కథనాలు పేర్కొంటున్నాయి.

టైగర్ ష్రాఫ్ కు ఫుట్‌బాల్ అంటే ఇష్టం. ముంబైలోని జుహూ ప్రాంతంలో ఉన్న ఓ గ్రౌండ్‌కు ఆయన తరచూ ఫుట్‌బాల్ ఆడేందుకు వెళ్తుంటారని నిందితులు గుర్తించినట్లు సమాచారం. ముఖ్యంగా ఆదివారాల్లో ఆయన అక్కడికి వచ్చే విషయాన్ని తెలుసుకుని దాడికి ప్రణాళిక రచించినట్లు తెలుస్తోంది.
ఆమిర్ ఖాన్‌ను లక్ష్యంగా చేసుకోవాలన్న ప్రణాళికకు గతంలో వచ్చిన బెదిరింపులతో సంబంధం ఉందా? అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. 2026 జులైలో గౌరీ స్ప్రాట్‌తో ఆమిర్ మూడో వివాహం జరిగిన సమయంలో.. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో సంబంధం ఉందని చెప్పుకున్న ఓ వ్యక్తి.. ఆమిర్ ఖాన్‌కు బెదిరింపులు చేసినట్లు వార్తలు వచ్చాయి.
ఇప్పుడు టైగర్ ష్రాఫ్ కాల్పుల కేసులోనూ అసలు టార్గెట్ గా ఆమిర్ పేరు వినిపిస్తుండటంతో.. ఈ రెండు వ్యవహారాల మధ్య సంబంధం ఉందా? అన్నది ఆసక్తికరంగా మారింది.
ఇది కూడా చదవండి: వివాదంలో ప్రభాస్ ఫౌజీ.. క్షమాపణ చెప్పాలంటూ నేతాజీ కుటుంబం డిమాండ్.!
[Bishnoi Gang First Target Aamir Khan, Lawrence Bishnoi Gang, Mumbai Firing Incident, Aamir Khan Target, Aamir Khan News, Bishnoi Gang, Tiger Shroff, Aamir Khan]




