కాంత ఫస్ట్ డే కలెక్షన్స్.. హిట్ కొట్టారా!
on Nov 15, 2025

-కాంత కలెక్షన్స్
-హిట్ కొట్టారా!
-తెలుగు టాక్ ఎలా ఉంది
-కలెక్షన్స్ పై పోస్టర్ రిలీజ్
లక్కీభాస్కర్ వంటి ఘన విజయం సాధించిన చిత్రం తర్వాత 'దుల్కర్ సల్మాన్'(Dulquer salmaan)కాంత(Kaantha)తో ఈ నెల 14 న ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పాన్ ఇండియా స్థాయిలో కాంత రిలీజ్ అవ్వగా దుల్కర్ సరసన 'భాగ్యశ్రీ బోర్సే'(Bhagyashri Borse)జత కట్టింది. ఒక సినిమా హీరో తన దర్శకుడుతో ఏర్పడిన గొడవల వల్ల ఇగో, అనుమానం, తొందరపాటుకి గురయ్యి తనని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అమ్మాయిని తన చేతులతోనే చంపుతాడు. ఆ తర్వాత దిగులుతో తల్లడిల్లిపోతాడు. ఈ పాయింట్ ఆధారంగానే కాంత తెరకెక్కింది.
ఇక ఈ మూవీ తొలి రోజు వరల్డ్ వైడ్ గా 10 .5 కోట్ల రూపాయల గ్రాస్ ని సాధించింది. ఈ మేరకు చిత్ర యూనిట్ అధికారంగా ప్రకటిస్తు ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేసింది.మెయిన్ లాంగ్వేజ్ లో తెరకెక్కిన తమిళంలో మూవీకి సూపర్ డూపర్ హిట్ టాక్ రాగా, తెలుగుతో పాటు మిగతా భాషల్లో మిక్స్డ్ టాక్ వచ్చింది. కొన్ని చిత్రాలకి టాక్ అంతగా బాగోకపోయినా మంచి కలెక్షన్స్ ని వసులు చేసిన సందర్భాలు ఉన్నాయి. మరి వీకెండ్ తో పాటు రాబోయే రోజుల్లో ఏ మేర కలెక్షన్స్ ని రాబడుతుందో చూడాలి.
aslo read : కృష్ణ పై మహేష్ బాబు ఎమోషనల్ ట్వీట్.. వైరల్ గా మారిన ssmb 29
పెర్ ఫార్మెన్స్ పరంగా చూసుకుంటే దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే తమ తమ పాత్రల్లో జీవించారు. దర్శకుడిగా కనిపించిన సముద్ర ఖని, పోలీస్ ఆఫీసర్ గా చేసిన రానా(Rana)నటన కూడా కట్టిపడేస్తుంది. పొట్లూరి ప్రశాంత్ తో కలిసి రానా, దుల్కర్ స్వయంగా కాంత ని నిర్మించగా, సెల్వమణి సెల్వరాజ్(Selvamani Selvaraj)దర్శకుడిగా వ్యవహరించాడు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



