గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్‌లో బోలెడన్ని సర్‌ప్రైజ్‌లు.. రాజమౌళి పోస్ట్ వైరల్!
on Nov 15, 2025
సూపర్‌స్టార్ మహేశ్, ఎస్.ఎస్.రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ అడ్వంచరస్ మూవీపై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో హై ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన భారీ ఈవెంట్ రామోజీ ఫిలింసిటీలో శనివారం ఎంతో భారీ ఎత్తున నిర్వహించబోతున్నారు. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే వేలాదిగా అభిమానులు రామోజీ ఫిలింసిటీకి చేరుకుంటున్నారు.
ఇదిలా ఉంటే.. ఈ ఈవెంట్‌లో స్పెషల్ సర్‌ప్రైజ్ ఉందంటూ రాజమౌళి చేసిన పోస్ట్‌తో అందరిలోనూ క్యూరియాసిటీ పెరిగింది. ఈ కార్యక్రమంలో సినిమా టైటిల్‌ను ప్రకటించడమే కాదు, మహేశ్‌బాబు పాత్ర, గెటప్‌తోపాటు సినిమా నిర్మాణానికి సంబంధించిన విజువల్స్‌ను కూడా ఆవిష్కరించనున్నారు. 100 అడుగుల ఎత్తుతో ఏర్పాటు చేసిన మెగా స్క్రీన్‌పై ఈ కంటెంట్‌ను ప్రేక్షకుల ముందు ఉంచబోతున్నారు.
మరోవైపు ఈవెంట్‌కు రూపొందించిన ప్రత్యేక పాస్‌లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పాస్‌పోర్ట్ డిజైన్‌లో రూపొందించిన ఈ పాస్‌లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అభిమానులు ఎలాంటి తొందరపడకుండా, ఒకరికొకరు సహకరిస్తూ కార్యక్రమం సజావుగా సాగడానికి సాయం చేయాలని రాజమౌళి, మహేశ్‌బాబు ప్రత్యేక వీడియోల ద్వారా విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. భారీ సంఖ్యలో ప్రేక్షకులు వచ్చే అవకాశం ఉండడంతో నిర్వాహకులు ప్రత్యేక ప్లానింగ్ చేశారు.
ఈ భారీ ఈవెంట్‌ను దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులు జియో హాట్‌స్టార్ ద్వారా ప్రత్యక్ష ప్రసారంగా వీక్షించవచ్చు. ఈ కార్యక్రమాన్ని ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకలోకం ఎదురుచూస్తోంది. హాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఎంతో మంది ఫిల్మ్ మేకర్స్ ఈ ఈవెంట్‌కి హాజరుకానుండటంతో సినీ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



