ఫ్యాన్స్‌కు జూనియర్ ఎన్టీఆర్ విన్నపం
on May 18, 2020
మే 20 జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు పండగ రోజు. కారణం.. ఆ రోజు ఆయన బర్త్‌డే. ఆ సందర్భంగా 'ఆర్ఆర్ఆర్' మూవీకి సంబంధించి తారక్ ఫస్ట్‌లుక్ లేదా ఆయన క్యారెక్టర్ టీజర్ విడుదలవుతుందని వేయికళ్లతో ఎదురుచూస్తోన్న అభిమానుల ఆశలు ఆవిరయ్యాయి. మార్చి 27 రామ్‌చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఎలాగైతే 'భీమ్ ఫర్ రామరాజు' టీజర్ రిలీజయ్యిందో, అలాగే మే 20న 'రామరాజు ఫర్ భీమ్' టీజర్ విడుదల అవుతుందని తారక్ ఫ్యాన్స్‌తో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా ఆశించారు. కానీ లాక్డౌన్ నేపథ్యంలో దానికి సంబంధించిన పనులు జరగలేదు. దాంతో తాము జూనియర్ ఎన్టీఆర్ క్యారెక్టర్ ఫస్ట్ లుక్ కానీ వీడియో గ్లింప్స్ కానీ విడుదల చేయలేకపోతున్నామని 'ఆర్ఆర్ఆర్' టీమ్ ట్వీట్ చేసింది. ఇది తారక్ ఫ్యాన్స్‌ను తీవ్ర నిరాశకూ, అసంతృప్తికీ గురిచేసింది. తమ డిజప్పాయింట్మెంట్ను కామెంట్ల రూపంలో సోషల్ మీడియా ద్వారా వారు వ్యక్తం చేస్తూ వస్తున్నారు.
దాంతో జూనియర్ ఎన్టీఆర్ సైతం స్పందించాడు. తన పుట్టినరోజు సందర్భంగా 'ఆర్ఆర్ఆర్' మూవీ నుండి ఎలాంటి ఫస్ట్ లుక్ లేదా టీజర్ విడుదలవడం లేదనే విషయం అభిమానులకు తీవ్ర నిరాశకు గురి చేసిందని తాను అర్థం చేసుకోగలనని సోషల్ మీడియా అకౌంట్లలో షేర్ చేసిన ఒక నోట్లో తెలిపాడు. "ఫస్ట్ లుక్ లేదా టీజర్ మీ ఆనందం కోసం సిద్ధం చేయాలని చిత్ర బృందం ఎంతంగా కష్టపడింది అనేది నాకు తెలుసు. కానీ ఒక ప్రచార చిత్రం మీ ముందు ఉండాలి అంటే అన్ని సాంకేతిక విభాగాలు కలిసి శ్రమించాలి. అధికారిక ఆంక్షల వలన అది కుదరలేదు" అని చెప్పాడు తారక్. అలాగే 'ఆర్ఆర్ఆర్' మూవీ ఒక సంచలనం సృష్టిస్తుందనే నమ్మకం తనకుందనీ, ఆ చిత్రం అభిమానుల్ని అలరిస్తుందనీ కూడా తారక్ ఆ నోట్లో తెలిపాడు. చివరగా తన విన్నపాన్ని మన్నిస్తారనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశాడు.
జూనియర్ ఎన్టీఆర్ పోస్ట్‌కు చాలా మంది ఫ్యాన్స్ సానుకూలంగా స్పందించారు. "మీ మాటే మాకు శాసనం అన్నా" అని కామెంట్స్ పెట్టారు.
Also Read