కాలం మారినా.. దేశం మారినా.. ఆమెతో మెగాస్టార్!
on May 18, 2020
భార్య సురేఖతో గతంలో అమెరికాలో గడిపిన క్షణాల లాంటి క్షణాలను కోవిడ్-19 లాక్‌డౌన్‌లో క్రియేట్ చేశారు మెగాస్టార్ చిరంజీవి. ఒకేలా అనిపించే అప్పటి, ఇప్పటి ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేశారు. సోషల్ మీడియాలో అడుగు పెట్టిన నాటి నుంచీ ఆయన పాత జ్ఞాపకాలను ఒక్కొక్కటే తవ్వి తీస్తూ, వాటికి సంబంధించిన ఫొటోలను షేర్ చేస్తూ, అభిమానులను ఎంటర్‌టైన్ చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు కూడా అలాంటి ఒక పాత ఫొటోను షేర్ చేయడమే కాకుండా, సరిగ్గా అలాగే అనిపిస్తోన్న ఇప్పటి ఫొటోను కూడా దానికి జత చేయడం గమనార్హం.
హాలిడేస్ గడపడం కోసం అమెరికా వెళ్లినప్పుడు కిచెన్‌లో చిరంజీవి ఏదో ప్రయోగం చేస్తుంటే, సురేఖ చేతిలో స్టీల్ బాక్స్ పట్టుకొని మరోవైపు చూస్తున్నారు. ఇప్పుడు కూడా సేమ్ టు సేమ్ సిట్చుయేషన్‌ను కల్పించి, ఫొటో తీసి పోస్ట్ చేశారు చిరంజీవి. ఇంకో విశేషం ఏమంటే రెండు ఫొటోల్లోనూ భార్యాభర్తలిద్దరూ ఒకే రకమైన డ్రస్సులు ధరించి ఉండటం. చిరంజీవి బ్లూ కలర్ టీ షర్ట్, జీన్స్ వేసుకుంటే, సురేఖ రెడ్ కలర్ శారీ ధరించారు. "తాను, నేను.. కాలం మారినా.. దేశం మారినా.." అనే కాప్షన్‌ను ఆ ఫొటోలకు జోడించారు చిరంజీవి. అంతేకాదు, పాత ఫొటోకు Joyful Holiday in America 1990 అనే కాప్షన్, ఇప్పటి ఫొటోకు 'Jail' full Holiday in Corona 2020 అనే కాప్షన్ పెట్టారు. ఈ పోస్ట్‌ను లక్షలాది మంది లైక్ చేశారు.
ఇక సినిమాల విషయానికొస్తే, కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' మూవీ చేస్తున్నారు మెగాస్టార్. ఇందులో ఆయన జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తున్నారు. 30 నిమిషాల సేపు కనిపించే కీలకమైన ఒక నక్సలైట్ క్యారెక్టర్‌ను రామ్‌చరణ్ చేయనున్నట్లు ఇదివరకు వార్తలు వచ్చాయి. కానీ తర్వాత రానా దగ్గుబాటి పేరు వినిపించింది. ఇప్పటివరకూ ఆ పాత్రను ఎవరు చేయనున్నారనే విషయంలో క్లారటీ లేదు. దీపావళి లేదా క్రిస్మస్ సీజన్‌లో ఈ సినిమాను తీసుకురావాలని ఇదివరకు అనుకున్నారు. ప్రస్తుత స్థితి ప్రకారం విడుదల వచ్చే ఏడాదికి జరిగింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
