
అల్లు అర్జున్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో ఓ భారీ సినిమా ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో రూపొందనున్న ఈ ప్రాజెక్ట్‌ను తాత్కాలికంగా AA23గా పిలుస్తున్నారు.
తాజాగా ఈ సినిమా క్యాన్సిల్ అయిందంటూ సోషల్ మీడియాలో వార్తలు షికార్లు చేశాయి. స్క్రిప్ట్ విషయంలో, షూటింగ్ విషయంలో అల్లు అర్జున్ నుంచి క్లారిటీ రాకపోవడంతో.. ప్రస్తుతం లోకేష్ మరో హీరో వైపు చూస్తున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
లోకేష్ కనగరాజ్‌కు రామ్ చరణ్‌తో సినిమా చేయాలనే ఆలోచన చాలా కాలం నుంచి ఉంది. ‘విక్రమ్’కు ముందే చరణ్‌కు లోకేష్ కొన్ని కథలు చెప్పినట్లు గతంలో వార్తలు వచ్చాయి.
అయితే ఈ కాంబినేషన్ ఎప్పుడు సెట్స్‌పైకి వస్తుందనే విషయంలో మాత్రం ఇప్పటికీ స్పష్టత లేదు. ప్రస్తుతం చరణ్ లైనప్ కూడా బిజీగా ఉండటంతో లోకేష్–చరణ్ సినిమా ఎప్పుడు మొదలవుతుందన్నది చెప్పడం కష్టమే.

ఇప్పుడు అసలు ఆసక్తి కలిగిస్తున్న పేరు మహేష్ బాబు. అల్లు అర్జున్, రామ్ చరణ్ ప్రాజెక్టుల విషయంలో క్లారిటీ లేకపోవడంతో లోకేష్ తన ఫోకస్‌ను మహేష్ వైపు మళ్లించారనే టాక్ వినిపిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌లోనే మహేష్–లోకేష్ కాంబినేషన్‌లో సినిమా ప్లాన్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది.
అయితే కొందరు మాత్రం ఈ వార్తలను పూర్తిగా ఖండిస్తున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ చేస్తున్న 'రాకా' పూర్తి కాగానే.. 2027 జనవరి నుంచి లోకేష్ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుందని చెబుతున్నారు.
మరి AA23 ప్రాజెక్ట్ నిజంగానే ఆగిపోయిందా? లోకేష్ తన నెక్స్ట్ మూవీని మహేష్ తో చేయబోతున్నాడా? అనేది క్లారిటీ రావాలంటే మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సిందే.
ఇది కూడా చదవండి: కామ్రేడ్ కళ్యాణ్ ట్రైలర్.. బాలయ్య ఫ్యాన్‌గా రాధిక.. శ్రీవిష్ణు మామూలు కామెడీ కాదు.!
[Is AA23 Movie Shelved, AA23 Shelved Or Not, Allu Arjun Lokesh Kanagaraj Film, Allu Arjun, Ram Charan, Mahesh Babu, Lokesh Kanagaraj, Telugu Film News]






