Home

»

Latest News

JD Chakravarthy: మా సినిమా ఆపేయాలని ప్రభుత్వం నుంచి ఫోన్ వచ్చింది

Apr 29, 2026 11:30AM

 


 విలక్షణ నటుడిగా, తనకంటూ ఒక ప్రత్యేక శైలిని ఏర్పరుచుకున్న హీరో నటుడు జెడి చక్రవర్తి(JD Chakravarthy). ఆయన మాటల్లో ఉండే వాడి, వేడి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాజాగా ఆయన నటించిన  'గాయపడ్డ సింహం'(Gaayapadda Simham)చిత్రం  ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జెడి చక్రవర్తి ఎప్పటిలాగే తనదైన శైలిలో చమత్కారాన్ని, గంభీరతని జోడించి  చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో మరియు సినీ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.అవేంటో చూద్దాం

జెడి చక్రవర్తి మాట్లాడుతూ  మా సినిమా స్టార్ట్ చేసినప్పటి నుంచి మేము ట్రంప్ ఏ ఐ వీడియోలు ఉపయోగించాం. దీంతో ఇక్కడి గవర్మెంట్ నుంచి ఒత్తిడి వచ్చింది. మా సినిమా రిలీజ్ చేయకూడదంటూ ఎన్నో ఫోన్స్ వచ్చాయని సరదాగా చెప్పే సరికి అందరూ నవ్వుకున్నారు. తన మాటల ప్రస్థానాన్ని కొనసాగిస్తూనే 'గాయపడ్డ సింహం" అనే టైటిల్ వినడానికి చాలా పవర్‌ఫుల్‌గా ఉంది. కంటెంట్ కూడా అదే స్థాయిలో ఉంటుంది. మా మూవీలో వర్క్  చేసిన ప్రతి ఒక్కరూ ప్రాణం పెట్టి పని చేశారు. వారి కష్టం తెరపై కనిపిస్తుంది.

Also read: Bhoot Bangla: బాక్సాఫీస్ వద్ద అక్షయ్ కుమార్ భూత్ బంగ్లా హవా.. వారంలో ఎన్ని కోట్లు అంటే   

సింహం గాయపడితే అది మరింత ప్రమాదకరంగా మారుతుంది. ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం అనేది ఒక యుద్ధం వంటిది. ఈ 'సింహం' ఆ యుద్ధంలో గెలుస్తుందని  జెడి  ధీమా వ్యక్తం చేశారు. ఇక ఈ మూవీ నుంచి  విడుదలైన పోస్టర్లు మరియు టీజర్ ఇప్పటికే  పాజిటివ్ వైబ్‌ని క్రియేట్ చేశాయి. జెడి చక్రవర్తి వంటి సీనియర్ నటుడు ఈ ప్రాజెక్ట్ గురించి ఇంత గొప్పగా మాట్లాడటం సినిమాపై ఉన్న అంచనాలను రెట్టింపు చేసింది. మరి ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద తన గర్జనను ఏ స్థాయిలో వినిపిస్తుందో వేచి చూడాలి. తరుణ్ భాస్కర్, మానస చౌదరి, ఫరియా అబ్దుల్లా కీలక రోల్స్ .

 

 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com