Home

»

Latest News

Bhoot Bangla: బాక్సాఫీస్ వద్ద అక్షయ్ కుమార్ భూత్ బంగ్లా హవా.. వారంలో ఎన్ని కోట్లు అంటే   

Apr 29, 2026

 

 

హయమ్మ ఎట్టకేలకు అక్షయ్ కుమార్(Akshay kumar)కి భూత్ బంగ్లా(Bhoot Bangla)తో హిట్ వచ్చింది. హిట్ అని చెప్పడం కంటే బాలీవుడ్ లో అక్షయ్ ని నిలబెట్టిందని చెప్పవచ్చు. అంతలా వరుస పరాజయాలతో జైత్రయాత్రని కొనసాగిస్తున్నాడు. దీన్ని బట్టి అక్షయ్ కి భూత్ బంగ్లా ఇచ్చిన కిక్ ని అర్ధం చేసుకోవచ్చు. దర్సకుడు మన సౌత్ డైరెక్టర్  ప్రియదర్శన్(Priyadarshan) . అదేనండి లోక చాప్టర్ యక్షిణి కళ్యాణి ప్రియదర్శన్ తండ్రి. మరిఈ నెల 17 న విడుదలై ఇప్పటి వరకు ఎంత కలెక్షన్స్ సాధించిందో చూద్దాం. 

పక్కా హారర్ కామెడీ అయిన 'భూత్ బంగ్లా' వరల్డ్ వైడ్ గా 188 .75 కోట్ల గ్రాస్ ని వసులు చేసింది. ఈ మధ్య కాలంలో ధురంధర్ 2 తర్వాత మంచి వసూళ్లు సాధించిన మూవీ భూత్ బంగ్లానే.  నిజానికి ప్రారంభంలో  మిశ్రమ సమీక్షలు వచ్చినప్పటికీ, కామెడీ ప్రియులను థియేటర్లకు రప్పించడంలో అక్షయ్ సక్సెస్ అయ్యాడు. మరి పన్నెండు రోజులకే 200 కోట్లకి చేరువలో ఉన్నాడంటే లాంగ్ రన్ లో కనివిని ఎరుగని కలెక్షన్స్ సాధించడం పక్కా.


Also read: vrutika patel: అబ్బాయిలు జాగ్రత్త..  విష్ణుప్రియని మించి కుర్రాళ్లకి షాకిస్తున్న ముద్దుగుమ్మ 

అక్షయ్ కుమార్ సరసన టబు జత కట్టగా  వమికా గబ్బీ, పరేష్ రావెల్, రాజ్‌పాల్ యాదవ్, జిషు సేన్ గుప్తా, మనోజ్ జోషి, అస్రానీ, రాజేశ్ శర్మ తదితరులు ముఖ్యమైన క్యారక్టర్స్ లో చేసారు. బాలాజీ మోషన్ పిక్చర్స్ తో కలిసి అక్షయ్ కుమార్ నే నిర్మించాడు.


 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com