Home

»

Latest News

బాలల దినోత్సవం కానుకగా బంపరాఫర్.. ఈ సినిమా టికెట్ రూ.150 మాత్రమే.!

Nov 13, 2026 4:40PM

సినిమా టికెట్ ధరలు పెరుగుతున్న ఈ రోజుల్లో ఓ చిత్రబృందం పిల్లల కోసం టికెట్ రేట్లను తగ్గిస్తూ మంచి నిర్ణయం తీసుకుంది. నవంబర్ 14న బాలల దినోత్సవం సందర్భంగా విడుదలవుతున్న 'జయంత్ అండ్ ది జింగో పెన్' సినిమా టికెట్ ధరలను రూ.250 నుంచి రూ.150కి తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. పిల్లలందరికీ ఈ సినిమాను చేరువ చేయాలనే ఉద్దేశంతో చిత్ర నిర్మాతలు ఈ నిర్ణయం తీసుకున్నారు.

జాతీయ అవార్డు గ్రహీత నవీన్ దేశబోయిన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని నమో జయం ప్రొడక్షన్స్ బ్యానర్‌పై దివ్య ప్రవీణ్ బొలిశెట్టి నిర్మించారు. మాస్టర్ జయంత్ బొలిశెట్టి ప్రధాన పాత్రలో నటించారు. బాలల దినోత్సవం రోజునే సినిమాను విడుదల చేయాలని నిర్ణయించడంతో పాటు, చిన్నారులకు ప్రత్యేక కానుకగా టికెట్ ధరలను తగ్గించారు.

ఈ సందర్భంగా దర్శకుడు నవీన్ దేశబోయిన మాట్లాడుతూ.. తమ సినిమాను కేవలం వ్యాపార కోణంలో చూడటం లేదని తెలిపారు. పిల్లలు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులందరూ కలిసి ఈ సినిమాను చూడాలనే ఉద్దేశంతో టికెట్ ధరను రూ.150కి తగ్గించినట్లు చెప్పారు. ఇప్పటికే పలు పాఠశాలలు ప్రత్యేక ప్రదర్శనల కోసం థియేటర్లను బుక్ చేసుకున్నాయని వెల్లడించారు. అంతేకాకుండా, కొందరు ఇప్పుడు తమ సినిమాలను బాలల దినోత్సవ ప్రత్యేక చిత్రాలుగా ప్రమోట్ చేస్తున్నారని, ఆ విషయంలో ప్రేక్షకులు పొరపాటు పడవద్దని ఆయన అన్నారు.

నిర్మాత దివ్య ప్రవీణ్ బొలిశెట్టి మాట్లాడుతూ.. పిల్లల మార్కులను మాత్రమే కాకుండా వారి మనసులను కూడా అర్థం చేసుకోవాలనే ఆలోచనతో ఈ సినిమాను రూపొందించినట్లు తెలిపారు. ఇందులోని భావోద్వేగాలు పిల్లలతో పాటు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు కూడా కనెక్ట్ అవుతాయని చెప్పారు. సహ నిర్మాత షఫి కూడా పిల్లలకు కానుకగా టికెట్ ధరలను తగ్గించామని, ఇప్పటికే పలు చోట్ల బుకింగ్స్ బాగున్నాయని వెల్లడించారు.

ఇది కూడా చదవండి: ‘DNK’ మూవీ రివ్యూ

ఈ సినిమాలో మాస్టర్ జయంత్ బొలిశెట్టితో పాటు ఊహా రెడ్డి, సత్యం రాజేష్, ఆశిష్ గాంధీ, మానస రాధాకృష్ణన్, తనికెళ్ల భరణి, కాశీ విశ్వనాథ్, మానిక్ రెడ్డి, అశోక్ కుమార్, శ్రీకాంత్ రెడ్డి, వెంకట్ రెడ్డి తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి ప్రవీణ్ బొలిశెట్టి సంగీతం అందించడంతో పాటు పాటలు కూడా రాశారు. పిల్లల మనస్తత్వం, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆలోచనల చుట్టూ ఈ కథ సాగనుంది.

ఇప్పటికే ఈ సినిమాను చూసేందుకు పిల్లలు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆసక్తి చూపిస్తున్నారని చిత్రబృందం తెలిపింది. బాలల దినోత్సవం సందర్భంగా నవంబర్ 14న థియేటర్లలోకి వస్తున్న ఈ సినిమాకు టికెట్ ధరను తగ్గించడం ప్రేక్షకులకు ఎంతవరకు ఉపయోగపడుతుందో చూడాలి. 

మీకు నచ్చవచ్చు:

ఇష్టంలేని పెళ్లి, భర్తపై మర్డర్ కేసు.. కీర్తి సురేష్ కొత్త సినిమా కథ ఇదే.!

‘ఇట్లు అర్జున’ మూవీ రివ్యూ

 

 

[JayanthAndTheJingoPen, JayanthBolisetty, NaveenDesaboyina, DivyaPraveen Bolisetty, ChildrensDaySpecial]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com