జాన్వీకపూర్ కి బిర్లా కుటుంబం భారీ కానుక..ముహూర్తం కుదిరిందా!
on Apr 12, 2025
అతిలోకసుందరి శ్రీదేవి(Sridevi)నటవారసురాలు జాన్వీకపూర్(Janhvi Kapoor)తెలుగులో'ఎన్టీఆర్'(Ntr)తో కలిసి 'దేవర'(Devara)తో ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.మొదటి సినిమాతోనే తల్లికి తగ్గ వారసురాలని అనిపించుకుంది.ప్రెజెంట్ 'రామ్ చరణ్'(Ram Charan)అప్ కమింగ్ మూవీ 'పెద్ది'(Peddi)లో చేస్తుంది.ఈ మూవీ కూడా 'దేవర' లాగా హిట్ అయితే 'జాన్వీ' తెలుగు నాట నెంబర్ వన్ హీరోయిన్ అయ్యే ఛాన్స్ ఉందనే టాక్ ఫిలిం సర్కిల్స్ లో వినపడుతుంది.
రీసెంట్ గా జాన్వీకి పారిశ్రామిక రంగంలో సుదీర్ఘ కాలంగా తమ ఆధిపత్యాన్నిచెలాయిస్తు వస్తున్నబిర్లా(Birla)కుటుంబం నుంచి భారీ గిఫ్ట్ అందింది.బిర్లా వారసురాలు అనన్య సుమారు 5 కోట్ల రూపాయిలు విలువ చేసే లంబోర్గిని మోడల్ కారుని జాన్వీ ఇంటికి పంపించి జాన్వీకి సర్ప్రైజ్ ఇచ్చారు.పర్ఫుల్ కలర్ లో ఉన్నఆ కారుతో పాటు'ప్రేమతో నీ అనన్య' అని రాసి ఉన్న ఒక గిఫ్ట్ ప్యాక్ కూడా వచ్చింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి.సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే జాన్వీ కి ఫాలోవర్స్ నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
కుమార మంగళం బిర్లా(Kumar Mangalam Birla)కూతురైన అనన్య(Ananya)ఈ మధ్య మాట్లాడుతు తాను సౌందర్య ఉత్పత్తులకి సంబంధించిన వ్యాపార రంగంలోకి అడుగుపెట్టబోతున్నట్టుగా ప్రకటించింది.ఈ సంస్థకి బ్రాండ్ అంబాసిడర్ గా జాన్వీ చెయ్యబోతుందని,అందుకే 5 కోట్ల రూపాయల విలువ చేసే'లంబోర్గిని' కారుని గిఫ్ట్ గా ఇచ్చారనే టాక్ ముంబై సినీ సర్కిల్స్ లో వినపడుతుంది.అనన్య,జాన్వీ ఎంతో కాలం నుంచి స్నేహితులుగా కొనసాగుతు వస్తున్నారు.గాయనిగా అనన్య పలు ప్రవైట్ ఆల్బమ్స్ కూడా చేసింది.
Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
