Home

»

Latest News

1000 కోట్లు కొట్టబోతున్నాడా: లేక సర్ప్రైజ్‌లు ఏమైనా ఉన్నాయా?

Oct 7, 2026 1:24PM

 

 

అక్టోబర్ 15 నుంచి జైలర్ 2 ద్వారా రజినీ మానియాతో సౌత్ ఫ్యాన్స్ అండ్ సినీ ప్రేమికులు ఊగిపోనున్నారు. అదే టైంలో కలెక్షన్స్ విషయంపై జోరుగానే  వారందరిలో చర్చలు మొదలయ్యాయి. కొంత ముందైతే ఏకంగా వెయ్యి కోట్లు సాధిస్తుందని నమ్మకాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. 

అయితే  తాజాగా 'జైలర్ 2' ట్రైలర్ చూసిన తర్వాత మొదటి భాగంలో వర్మని అంతం చేసిన తర్వాత టైగర్ ముత్తువేల్ పాండియన్ మరోసారి అజ్ఞాతంలోకి వెళ్లి సాధారణ జీవితం గడుపుతుంటాడని ట్రైలర్ స్పష్టం చేస్తోంది. అయితే వర్మకు సంబంధించిన భారీ అండర్‌వరల్డ్ నెట్‌వర్క్ ముత్తువేల్‌ను ముప్ప తిప్పలు పెట్టేందుకు వేట మొదలుపెడుతుంది. ఈ క్రమంలో ముత్తువేల్ పాండియన్ తన పాత గతాన్ని మళ్లీ బయటకు తీసి, శత్రువులందరినీ ఒకే వేదికపైకి రప్పించి ఎదురుదాడి చేసే రహస్య ఆపరేషన్ చేపట్టడమే ఈ సీక్వెల్ కథాంశంగా కనిపించనుంది. ఈసారి కూడా మోహన్‌లాల్, శివ రాజ్‌కుమార్‌ల ప్రత్యేక పాత్రలు కథని తిప్పే కీలక మలుపులుగా నిలవనున్నాయి.

అయితే ట్రైలర్‌పై వస్తున్న ప్రధాన విమర్శ ఏమిటంటే, దర్శకుడు నెల్సన్ కథలోని అసలు విషయాలను, హీరో నెట్‌వర్క్ ప్లాన్‌ను ముందుగానే ఎక్కువగానే రివీల్ చేసేశాడని కొందరు అభిప్రాయపడుతున్నారు. దీంతో సినిమాలో ఇంకా కొత్తగా చూపించేది ఏముంటుంది అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. గతంలో కూడా 'లియో', 'కంగువ', 'కూలీ', మరియు 'జననాయకన్' వంటి తమిళ చిత్రాలకు విడుదలకు ముందు 1000 కోట్లు వసూలు చేస్తుందంటూ భారీ హైప్ వచ్చి, ఆ తర్వాత బాక్సాఫీస్ వద్ద అంచనాలను పూర్తిగా అందుకోలేకపోయిన ఉదాహరణలు ఉన్నాయి. ఇప్పుడు జైలర్ 2 విషయంలోనూ 1000 కోట్ల వసూళ్లపై చర్చ జరుగుతుండగా, వెయ్యి కోట్ల క్లబ్‌లో చేరడం అంత సులభం కాదని సినీ విశ్లేషకులు  భావిస్తున్నారు.

 

 

ఇది కూడా చదవండి:  రెండోసారి తల్లి కాబోతున్న కియారా అద్వానీ.. భర్త సిద్ధార్థ్ మల్హోత్రా పోస్ట్ వైరల్!

విద్యాబాలన్, మిథున్ చక్రవర్తి, ఎస్‌జే సూర్య, సూరజ్ వెంజమూరి వంటి దిగ్గజ తారాగణం నటిస్తుండటంతో సినిమా రేంజ్ పెరిగింది. ఒకవేళ ట్రైలర్‌లో చూపించని రహస్య ట్విస్టులు, ఆశ్చర్యపరిచే సర్ప్రైజ్ ఎలిమెంట్స్ థియేటర్లో ఉంటే మాత్రం పరిస్థితులు మారిపోయి కలెక్షన్ల సునామీ రావడం ఖాయం.

 

[Jailer 2 Trailer Analysis, Jailer 2, Rajinikanth, Jailer 2 Trailer Review, Nelson Dilipkumar, Muthuvel Pandian, Telugu Cinema News, Telugu Cinema, Tollywood, Tollywood News]
 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com