Home

»

Latest News

జైలర్ 2 టికెట్ రేట్లు పెంపు: ఏపీలో కొత్త ధరలు ఇవే.!

Oct 10, 2026 9:59AM

సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన మోస్ట్ అవేటెడ్ సీక్వెల్ ‘జైలర్ 2’ థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉండగా.. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సినిమా టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. దీంతో తొలి వారం రోజుల్లో జైలర్ 2 టికెట్లు కాస్త ఎక్కువ ధరకు అందుబాటులోకి రానున్నాయి.

నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను సన్ పిక్చర్స్ నిర్మించింది. తెలుగు రాష్ట్రాల్లో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని విడుదల చేస్తోంది. అక్టోబర్ 15న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా కోసం ఇప్పటికే అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

‘జైలర్ 2’ టికెట్ ధరల పెంపునకు సంబంధించి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ చేసిన విజ్ఞప్తిని పరిశీలించిన ఏపీ ప్రభుత్వం.. అదనపు ధరలకు అనుమతి ఇచ్చింది. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం అక్టోబర్ 15 నుంచి 21 వరకు మొత్తం ఏడు రోజుల పాటు ఈ పెంపు అమల్లో ఉంటుంది.

సింగిల్ స్క్రీన్ థియేటర్లలో సాధారణ టికెట్ ధరపై అదనంగా రూ.50 వరకు పెంచుకోవచ్చు. మల్టీప్లెక్స్‌లలో టికెట్‌పై రూ.75 వరకు అదనంగా వసూలు చేసేందుకు అనుమతి లభించింది.

టికెట్ ధరల పెంపుతో పాటు మొదటి వారంలో రోజుకు ఐదు షోలు ప్రదర్శించుకునేందుకు కూడా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 

రజనీకాంత్, నెల్సన్ కాంబినేషన్‌లో వచ్చిన ‘జైలర్’ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా తెలుగులోనూ ఈ సినిమా మంచి వసూళ్లు సాధించడంతో సీక్వెల్‌పై ఆసక్తి పెరిగింది. ఇప్పుడు ‘జైలర్ 2’లో మరింత భారీ యాక్షన్, స్టార్ కాస్ట్ ఉండటంతో ప్రేక్షకుల్లో అంచనాలు నెలకొన్నాయి.

ఇది కూడా చదవండి: హనుమాన్ అంశ్ తెలుగు పరిస్థితి ఏంటి.?

 

 

[Jailer 2 Ticket Price Hike AP, Jailer 2 AP Ticket Rates, Jailer 2 Release Date, Jailer 2 Telugu Release, Jailer 2 Movie, Rajinikanth, Sithara Entertainments, Nelson Dilipkumar, Telugu Film News]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com