Home

»

Latest News

హనుమాన్ అంశ్: హిందీలో సంచలనం.. తెలుగులో పరిస్థితి ఏంటి.?

Oct 9, 2026 6:49PM

బాలీవుడ్‌లో ఎలాంటి భారీ అంచనాలు లేకుండా విడుదలై.. ఆ తర్వాత మౌత్ టాక్‌తో బాక్సాఫీస్ దగ్గర సంచలనం సృష్టించిన సినిమా ‘హనుమాన్ అంశ్’. నీమ్ కరోలి బాబా జీవిత ప్రేరణతో తెరకెక్కిన ఈ భక్తిరస చిత్రానికి హిందీలో ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. 

సుమారు రూ.2 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు ఈ సినిమా తెలుగులోనూ థియేటర్లలోకి వచ్చింది. మరి హిందీలో వచ్చిన అద్భుతమైన స్పందన తెలుగులోనూ రిపీట్ అవుతుందా?

విశాల్ చతుర్వేది దర్శకత్వంలో తెరకెక్కిన ‘హనుమాన్ అంశ్’లో శోబినవ్ సత్య నీమ్ కరోలి బాబా పాత్రలో నటించారు. హిందీలో ఆగస్టు 7న విడుదలైన ఈ సినిమా మొదట్లో పెద్దగా సందడి చేయలేదు. కానీ పాజిటివ్ మౌత్ టాక్‌తో క్రమంగా ప్రేక్షకులను ఆకట్టుకుని భారీ విజయాన్ని అందుకుంది.

ఈ సినిమా తెలుగు వెర్షన్‌ను సెప్టెంబర్ 18న విడుదల చేయాలని తొలుత భావించారు. అయితే కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. చివరకు అక్టోబర్ 9న తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

హిందీలో ఇప్పటికే భారీ విజయం సాధించిన సినిమా కావడంతో తెలుగులోనూ ఆసక్తి ఏర్పడింది. తొలి స్పందన కూడా పాజిటివ్‌గానే ఉంది. హైదరాబాద్ వంటి నగరాల్లోని కొన్ని మల్టీప్లెక్స్‌లలో బుకింగ్స్‌ కూడా కనిపిస్తున్నాయి. అయితే హిందీలో వచ్చిన స్థాయి విజయాన్ని తెలుగు వెర్షన్ అందుకోవాలంటే మరింత మంది ప్రేక్షకులకు సినిమా చేరాల్సి ఉంది.

ముఖ్యంగా తెలుగులో ఈ సినిమాకు పెద్దగా ప్రచారం జరగకపోవడం కొంత ప్రభావం చూపించే అవకాశం ఉంది. భారీ సినిమాలకు ఉండే హడావుడి, స్టార్ ప్రమోషన్స్‌ ఈ చిత్రానికి కనిపించలేదు. హిందీలోనూ మొదట్లో పెద్దగా అంచనాలు లేకుండానే విడుదలైన ఈ సినిమా.. పాజిటివ్ టాక్‌తోనే పుంజుకుంది. ఇప్పుడు తెలుగులోనూ అదే తరహాలో ప్రేక్షకుల ఆదరణ పెరుగుతుందా అనేది ఆసక్తికరంగా మారింది.

ఇది కూడా చదవండి: 49 ఏళ్లకే వెళ్లిపోయినా.. తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా శ్రీహరి.!

 

 

 

[Hanuman Ansh Telugu Response, Hanuman Ansh Telugu Release, Hanuman Ansh Box Office, Hanuman Ansh Movie, Neem Karoli Baba, Vishal Chaturvedi, Shobhinaw Satyaa, Telugu Film News]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com