Home

»

Latest News

Jailer 2: జైలర్ 2 వచ్చేస్తుంది.. ఆ డేట్ కి ఎందుకు రిలీజ్ చేస్తున్నారు!

Jun 26, 2026 3:06PM

ముత్తువేల్ పాండియన్ గా సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth)తన వన్ మాన్ షో 'జైలర్' తో సృష్టించిన ప్రభంజనం తెలిసిందే. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ కి సిక్వెల్ గా జైలర్ 2 (jailer 2) తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.


 ఈ సీక్వెల్ ని సెప్టెంబర్ 11 న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేయడానికి చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సెప్టెంబర్ 14న వినాయక చవితి పండుగ ఉండటంతో, లాంగ్ వీకెండ్ కలిసివచ్చి సినిమా వసూళ్లకు భారీగా ప్లస్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారు.నిజానికి ఈ సమ్మర్ కే  విడుదల చేయాలని అనుకున్నప్పటికీ, పోస్ట్ ప్రొడక్షన్ పనులు, ప్యాచ్ వర్క్ షూటింగ్ కోసం దర్శకుడు నెల్సన్ మరో 25 రోజుల సమయం పెంచడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.  ఈ సీక్వెల్‌లో కేవలం రజినీకాంత్ మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా ఉన్న పలువురు సూపర్ స్టార్లు కూడా భాగం కాబోతున్నారు. బాలీవుడ్ సీనియర్ నటుడు మిథున్ చక్రవర్తి, విద్యాబాలన్, ఎస్‌జె సూర్య, సూరజ్ వెంజారమూడు వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మొదటి భాగంలో మెరిసిన మోహన్‌లాల్, శివ రాజ్‌కుమార్ కూడా ఈ సీక్వెల్‌లో తమ పాత్రలను పునరావృతం చేయనున్నారు. 


Also read: Lenin: లెనిన్ బ్లాక్ బస్టర్ పక్కా.. లెక్కలు ఇవే 

అయితే ఈ సినిమాకు సంబంధించిన అత్యంత క్రేజీ అప్‌డేట్ ఏంటంటే, బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్  ఒక పవర్‌ఫుల్ క్యామియో రోల్‌లో కనిపించబోతున్నారు. ఇటీవల చెన్నైలో జరిగిన రెండు రోజుల ప్రత్యేక షెడ్యూల్‌లో (జూన్ 22, 23 తేదీల్లో) హృతిక్ రోషన్ తన షూటింగ్‌ను పూర్తి చేసుకున్నారు. దర్శకుడు నెల్సన్ ఆయన కోసం ఒక అదిరిపోయే ఇంట్రడక్షన్ సీన్, అలాగే రజినీకాంత్‌తో కలిసి వచ్చే హై-వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్‌ను డిజైన్ చేశారు. ఈ సీన్ సినిమాకే ప్రధాన హైలైట్ కానుందని సమాచారం.  ఈ షూటింగ్ సెట్‌లో మొబైల్ ఫోన్లను పూర్తిగా నిషేధించి, హృతిక్ రోషన్ లుక్ లీక్ అవ్వకుండా చిత్ర యూనిట్ కఠినమైన జాగ్రత్తలు తీసుకుంది. విశేషమేమిటంటే, 1986లో వచ్చిన ‘భగవాన్ దాదా’ సినిమా తర్వాత దాదాపు 40 సంవత్సరాల లాంగ్ గ్యాప్ అనంతరం రజినీకాంత్, హృతిక్ రోషన్ కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం విశేషం. అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తుండగా, సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ ఈ ప్రాజెక్ట్‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ముత్తువేల్ పాండియన్ పాత్రలో తలైవా మరోసారి బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట మొదలుపెట్టడానికి సిద్ధమవుతున్నారు. ఈ క్రేజీ అప్‌డేట్స్‌తో జైలర్ 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. 

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com