Home

»

Latest News

చివరి నిమిషంలో షాక్: 'జైలర్ 2' ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అవ్వడానికి కారణమేంటి.?

Oct 12, 2026 10:49AM

సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన ‘జైలర్ 2’ కోసం తెలుగు ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అక్టోబర్ 15న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. తెలుగులో ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ విడుదల చేస్తోంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లోనూ సినిమాపై అంచనాలు పెంచేందుకు భారీ ప్రమోషన్స్ ప్లాన్ చేశారు.

ఇందులో భాగంగా అక్టోబర్ 12న హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే చివరి నిమిషంలో ఈ వేడుక రద్దయినట్లు ప్రకటన రావడంతో అభిమానుల్లో ఒక్కసారిగా చర్చ మొదలైంది. ఈవెంట్ రద్దు వెనుక ఉన్న అసలు కారణం ఏమిటనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

మరోవైపు ‘జైలర్ 2’ తమిళ్ ప్రమోషన్స్ విషయంలో మేకర్స్ ఇప్పటికే కొత్త పంథాను ఎంచుకున్నారు. సాధారణంగా రజనీకాంత్ సినిమాలకు భారీ స్థాయిలో ఆడియో లాంచ్ నిర్వహించడం ఆనవాయితీ. కానీ ఈసారి అలాంటి వేడుకను నిర్వహించకుండా.. ‘జైలర్ 2 సూపర్ షో’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని సన్ నెక్స్ట్ ఓటీటీలో విడుదల చేశారు.

అయితే హైదరాబాద్‌లో జరగాల్సిన తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దుకు కూడా ఇదే ప్రచార వ్యూహం కారణమా? లేక మరేదైనా కారణం ఉందా? అనేది తెలియాల్సి ఉంది.

నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సీక్వెల్‌లో రజనీకాంత్ మరోసారి టైగర్ ముత్తువేల్ పాండియన్‌గా కనిపించనున్నారు. తొలి భాగం విజయంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్, జాకీ ష్రాఫ్ వంటి ప్రముఖ నటులు కూడా ఈ చిత్రంలో భాగమయ్యారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు.

ఇది కూడా చదవండి: 'జైల‌ర్‌2'కి పోటీగా 'ర‌ణ‌బాలి'.. ర‌జినీకాంత్‌పై విజ‌య్ దేవ‌ర‌కొండ 'హ్యాట్రిక్' కొడ‌తాడా.?

 

 

 

[Jailer 2 Event Cancelled, Jailer 2 Pre Release Event, Jailer 2 Telugu Release, Sithara Entertainments, Naga Vamsi, Rajinikanth, Nelson Dilipkumar, Anirudh Ravichander, Telugu News]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com