
రాగం, తాళం ఏదైనా సరే మంచి 'పాట' వింటే పులకరించిపోతాం. ఇప్పుడు ఆ పాటే ఉద్యోగం కూడా కల్పిస్తే! ఏంటి జోక్ అనుకుంటున్నారా! జోక్ కాదు పచ్చి నిజం. పాట ఉద్యోగాన్ని కూడా ఇస్తుంది.
ఓ నా సిద్ధయ్య’.. సిద్ధు రెడ్డి, కాత్యాయని జగన జంటగా ఈ సాంగ్ లో చేసారు. రామ్ అద్నాన్ పాటని రాయడంతో పాటు తెరకెక్కించారు. కళ్యాణ్ కీస్ సంగీత సారథ్యంలో రామ్ అద్నాన్, శ్రీనిధి ఈ పాటను పాడారు. ఈ సాంగ్ బృందం ఆధ్వర్యంలో హైదరాబాద్ హైటెక్ సిటీలోని సైబర్ గార్డెన్స్‌లో మంగళవారం మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నిరుద్యోగ యువతీ యువకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. సుమారు 70 ప్రముఖ కంపెనీల ప్రతినిధులు మేళాలో పాల్గొని ఉద్యోగాల కోసం అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. అర్హత కలిగిన అభ్యర్థులను అక్కడికక్కడే ఎంపిక చేసి, పలువురికి వెంటనే ఆఫర్ లెటర్లు అందజేశారు.
ఇది కూడా చదవండి: ఆదర్శ కుటుంబం'శ్రీనిధి శెట్టి కెరీర్‌ని మలుపు తిప్పుతుందా:ట్రాక్ రికార్డు మాత్రం ఇదే!
[O Naa Siddayya Song Titile First look announced, O Naa Siddayya,Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tolywood News]




