Home

»

Latest News

జగపతిబాబు మాటని గౌరవించిన గుంటూరు.. సోదరికి భారీ మెజారిటీ..మరి పార్టీ లేదా పుష్ప!

Nov 4, 2026 1:26PM

 


జగపతి బాబు.. ఎనీ క్యారెక్టర్ లో మెస్మరైజ్ చేసే అరుదైన వజ్రం లాంటి యాక్టర్. మరి ఆ దిగ్గజ నటుడి సోదరి లక్ష్మీ అపర్ణ  ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి జిల్లాగా ఉన్న  గుంటూరు మేయర్ పీఠాన్ని కైవసం చేసుకున్నారు. లెజండ్రీ నటుడి సోదరి కాబట్టి సినీ హోదాలోనే ఆ న్యూస్ వివరాలేంటో చూసేద్దాం. 

కొన్ని రోజుల క్రితం జరిగిన  ఆంధ్రప్రదేశ్  స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు నిన్న విడుదలయ్యాయి. గుంటూరు నగర మేయర్ స్థానానికి కూటమి తరఫున తెలుగుదేశం పార్టీ నుంచి కోవెలమూడి లక్ష్మీ అపర్ణ బరిలోకి దిగింది.  నగరంలోని మొత్తం 76 డివిజన్లకు జరిగిన ఈ ఎన్నికల పోరులో లక్ష్మీ అపర్ణ తన సమీప ప్రత్యర్థులపై అఖండ విజయాన్ని సొంతం చేసుకుని గుంటూరు పీఠాన్ని కైవసం చేసుకున్నారు. ఎన్నికల ప్రచార సమయంలో టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో జగపతి బాబు స్వయంగా రంగంలోకి దిగి తన చెల్లెలు కోవెలమూడి లక్ష్మీ అపర్ణ కోసం ప్రత్యేకంగా వీడియో సందేశాన్ని విడుదల చేయడం ఆ సమయంలో రాష్ట్రవ్యాప్తంగా విపరీతమైన హైప్ తెచ్చిపెట్టింది. "నా చెల్లి లక్ష్మీ అపర్ణ ఎంతో సమర్థురాలు, మంచి మనసున్న వ్యక్తి. గతంలో సార్వత్రిక ఎన్నికల్లో కూటమికి ఏవిధంగా భారీ మెజారిటీ అందించారో, అలాగే ఇప్పుడు నా చెల్లిని మరియు కూటమి కార్పొరేటర్ అభ్యర్థులను సైకిల్ గుర్తుపై ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలి" అంటూ జగపతి బాబు చేసిన భావోద్వేగ అభ్యర్థన ఓటర్లను విపరీతంగా ఆకట్టుకుంది.   

ఇది కూడా చదవండి: తమిళ సినీ పరిశ్రమకి సీఎం విజయ్ గుడ్‌న్యూస్: ఎంతైనా సినీ బిడ్డ కదా!

 

 

 ఇలా గెలుపు అనంతరం  ఇది కేవలం ఒక సాధారణ రాజకీయ విజయం కాదని, ప్రజలు తనపై ఉంచిన అపారమైన బాధ్యత అని గెలుపు అనంతరం కోవెలమూడి లక్ష్మీ అపర్ణ స్పష్టం చేశారు. స్వచ్ఛ గుంటూరు, హరిత గుంటూరు సాధనే తన ప్రథమ ధ్యేయమని, నగర ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని ఏమాత్రం వమ్ము చేయకుండా అభివృద్ధి బాటలో నడిపిస్తానని ఆమె హామీ ఇచ్చారు. ఈ చారిత్రాత్మక విజయం వెనుక సీఎం చంద్రబాబు నాయుడు మార్గదర్శకత్వం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరియు బీజేపీ రాష్ట్ర నాయకుల సంయుక్త కృషి ఎంతో ఉందని లక్ష్మీ అపర్ణ కృతజ్ఞతలు తెలిపారు.  లక్ష్మి అపర్ణ  96,294 ఓట్ల మెజార్టీతో విజయకేతనం ఎగురవేశారు. ఇక అభిమానులు సోషల్ మీడియా వేదికగా మీరు చెప్పినట్లే మీ సోదరిని గెలిపించాం. పార్టీ లేదా పుష్ప అని  కామెంట్స్ చేస్తున్నారు. 

 

 

[Jagapathi Babu Sister Kovelamudi Lakshmiparna Wins Guntur Mayor, Jagapathi Babu About Lakshmi Aparna, Jagapathi Babu sister, Guntur Corporation Election, Tollywod, tollywood News, Telugu Cinema, Telugu CInema News]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com