Home

»

Latest News

గాడ్ ఆఫ్ వార్: త్రివిక్రమ్, ఎన్టీఆర్‌కు అసలైన పరీక్ష.!

Nov 4, 2026 1:31PM

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో రాబోతున్న భారీ మైథలాజికల్ ప్రాజెక్ట్ ‘గాడ్ ఆఫ్ వార్’పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా కార్తికేయ స్వామి నేపథ్యంతో తెరకెక్కనున్న ఈ సినిమా ఇద్దరి కెరీర్స్ లోనే అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌గా నిలవబోతోందనే టాక్ ఉంది. అయితే ఈ సినిమా ఇద్దరికీ ఒక కీలకమైన పరీక్ష కూడా కాబోతోందా? అనే చర్చ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

త్రివిక్రమ్ విషయానికి వస్తే.. బలమైన సంభాషణలు, కుటుంబ భావోద్వేగాలు, కథలోని తాత్విక అంశాలను తనదైన శైలిలో చెప్పడం ఆయన ప్రత్యేకత. అయితే ఇటీవలి సినిమాల విషయంలో మాత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయారనే అభిప్రాయాలు ఉన్నాయి. ముఖ్యంగా ‘గుంటూరు కారం’, ‘ఆదర్శ కుటుంబం’ సినిమాలు త్రివిక్రమ్ స్థాయిలో లేవనే కామెంట్స్ వినిపించాయి.

ఇప్పుడు ‘గాడ్ ఆఫ్ వార్’ రూపంలో ఆయన ముందున్న సవాలు మరింత పెద్దది. పురాణాలపై త్రివిక్రమ్ కి ఉన్న పట్టు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. అయితే ఆ కంటెంట్ ని అంతే అద్భుతంగా తెరపైకి తీసుకొస్తారా? అనేది ఆయన ముందున్న సవాలు. బలమైన కథ, భావోద్వేగాలు, పాత్రల చిత్రణతో పాటు భారీ సెట్స్, గ్రాఫిక్స్, యాక్షన్ సన్నివేశాలతో ముడిపడి ఉన్న మైథలాజికల్ ప్రాజెక్ట్ ఇది. ఈ జానర్ కానీ, ఇలాంటి వీఎఫ్ఎక్స్ అవసరమున్న సినిమాలు కానీ ఇంతకముందు చేసిన అనుభవం త్రివిక్రమ్ కి లేదు. 

మరోవైపు ఎన్టీఆర్‌కు కూడా ఈ సినిమా ఒక పెద్ద ఛాలెంజ్ అనే చెప్పాలి. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘డ్రాగన్’లో డ్రగ్ లార్డ్ తరహా పాత్రలో కనిపించబోతున్న ఎన్టీఆర్.. ఆ తర్వాత త్రివిక్రమ్ సినిమాలో కార్తికేయుడి పాత్రలో కనిపించనుండటం ఆసక్తిని పెంచుతోంది. ఒక సినిమాలో పూర్తిగా మాస్, రగ్గడ్ షేడ్స్ ఉన్న పాత్ర.. మరో సినిమాలో దైవిక నేపథ్యం కలిగిన పాత్ర. ఈ రెండు పాత్రల మధ్య ఎన్టీఆర్ చూపించబోయే వేరియేషన్ ఎలా ఉంటుందనేది అభిమానుల్లో ఆసక్తి రేపుతోంది.

ముఖ్యంగా కార్తికేయుడి పాత్రను తెరపై ఆవిష్కరించడం అంత సులభమైన విషయం కాదు. ఆ పాత్రకు ఉండే దైవిక గాంభీర్యం, యోధుడి లక్షణాలు, భావోద్వేగాలు అన్నింటినీ సమపాళ్లలో చూపించాలి. ఎన్టీఆర్ నటనకు మంచి అవకాశం ఉన్నప్పటికీ, ఆ పాత్రకు తగ్గట్టుగా స్టోరీ, స్క్రీన్‌ప్లే, విజువల్ ప్రెజెంటేషన్ ఉండటం చాలా ముఖ్యం.

మొత్తానికి ‘డ్రాగన్’తో మాస్ అవతారంలో కనిపించనున్న ఎన్టీఆర్.. ‘గాడ్ ఆఫ్ వార్’తో పూర్తిగా భిన్నమైన పాత్రలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మరోవైపు త్రివిక్రమ్ కూడా తన కెరీర్‌లోనే భారీ ప్రయోగానికి సిద్ధమవుతున్నారు. మరి ఈ ఇద్దరి కలయికలో రాబోయే ఈ మైథలాజికల్ ప్రాజెక్ట్ ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి.

ఇది కూడా చదవండి: రాప్తాడు ఘటన వెనుక అసలు నిజాలు.. సినిమాల వల్లే నేరాలు జరుగుతున్నాయా.?

 

 

 

[Jr NTR Trivikram Movie, God Of War Movie, Lord Karthikeya, Jr NTR, Trivikram Srinivas, Dragon Movie, Aadarsha Kutumbam Movie, Telugu Film News]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com