Home

»

Latest News

Peddi: రామ్ చరణ్‌ని అలా అనేసరికి చిరంజీవి ఫీలయ్యారు.. జగపతి బాబు షాకింగ్ కామెంట్స్!

Jun 12, 2026 3:59PM

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), ఉప్పెన ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబు (Buchi Babu) కాంబినేషన్‌లో వచ్చిన లేటెస్ట్ రా అండ్ రస్టిక్ పాన్ ఇండియా మూవీ 'పెద్ది' (Peddi). బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో దూసుకుపోతున్న ఈ చిత్రంలో వర్సటైల్ యాక్టర్ జగపతి బాబు ఒక పవర్‌ఫుల్ పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించిన నేపథ్యంలో చిత్ర బృందం మరింత ఉత్సాహంగా ప్రమోషన్స్ చేస్తోంది. ఈ క్రమంలోనే జగపతి బాబు (Jagapathi Babu), బుచ్చిబాబు ప్రత్యేక ఇంటర్వ్యూను మేకర్స్ విడుదల చేశారు. 

ఈ ఇంటర్వ్యూలో గతంలో 'రంగస్థలం' సినిమా సమయంలో మెగాస్టార్ చిరంజీవితో జరిగిన ఒక ఆసక్తికరమైన ఇండస్ట్రీ సీక్రెట్‌ను జగపతి బాబు ఈ సందర్భంగా పంచుకోవడం విశేషం.  ఆ కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.

జగపతి బాబు మాట్లాడుతూ.. గతంలో సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన బ్లాక్‌బస్టర్ 'రంగస్థలం' సినిమా సమయంలో తాను స్టేజ్ పైన రామ్ చరణ్ నటన గురించి ప్రస్తావిస్తూ ఒక కామెంట్ చేశానని గుర్తుచేసుకున్నారు. "ఫస్ట్ టైం రామ్ చరణ్ నటించాడు" అని అన్నాను. ఆ మాటలకు చిరంజీవి గారు ఒకింత ఫీలయ్యారని జగపతి బాబు ఓపెన్‌గా వెల్లడించారు. 

"రంగస్థలంలో రామ్ చరణ్ నాకు విపరీతంగా నచ్చాడు. అప్పటి నుంచి ప్రతి సినిమాకు ఆర్టిస్ట్ గా ఎన్నో రెట్లు ఎదుగుతూ వెళ్తున్నాడు. ఇక పెద్ది సినిమాలో పీక్. చాలా గొప్పగా చేశాడు. ఎక్కడికో వెళ్ళిపోయాడు." అంటూ రామ్ చరణ్ నటనపై ప్రశంసలు కురిపించారు జగపతి బాబు.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com