Home

»

Latest News

Anna lezhneva: అన్నాలెజినోవా ఎమోషనల్ పోస్ట్.. అసలు ఈ పోస్ట్ ఎవరు ఉహించి ఉండరు  

Jun 12, 2026 4:13PM


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan kalyan)వైఫ్ అన్నాలెజినోవా(Anna lezhneva)కి పవన్ అభిమానులతో పాటు తెలుగు ప్రజలలో ప్రత్యేక స్థానం ఉంది. ఇటీవల సోషల్ మీడియాలో కూడా ఎంటర్ అయ్యి తన భావాలు, అనుభూతుల గురించి చేస్తూ టాక్ ఆఫ్ ది డేగా నిలుస్తుంది. ఆ కోవలోనే ఈ రోజు కూడా టాక్ ఆఫ్ ది డేగా నిలిచింది. అన్నా లెజినోవా రీసెంట్ గా ఎక్స్ వేదికగా 'జనాలు కేవలం పత్రికల్లో వచ్చే ఫోటోలని, ముఖాల్లోని నవ్వులు, సంబరాలు  విజయాన్ని మాత్రమే చూస్తారు. కానీ ఈ సక్సెస్ వెనుక ఉన్న ఇన్నేళ్ల సుదీర్ఘ పోరాటాన్ని, కష్టాన్ని చాలా తక్కువ మంది మాత్రమే చూడగలరు. ,  ప్రపంచమంతా తనకి వ్యతిరేకంగా నిలబడినట్లు అనిపించిన ఆ రాత్రి పగళ్లని చాలా కొద్దిమంది మాత్రమే అర్థం చేసుకోగలరు. రాజకీయాల్లో ఆయన్ని ఎందరో అవమానించారు, ఎగతాళి చేశారు, రకరకాల పేర్లతో దూషిస్తూ నిరంతరం ప్రశ్నించారు.  ప్రజల కోసం ఆయన యుద్ధాలు చేస్తున్నప్పుడు, నేను ఇంట్లో మా పిల్లల కోసం మానసికంగా ధైర్యంగా నిలబడటానికి ప్రయత్నించేదాన్ని. చాలా సందర్భాలలో నన్ను నేను పూర్తిగా ఒంటరిగా భావించాను. నేను కూడా పూర్తిగా కుంగిపోవాలనిపించిన రోజులు, ఎంతో భయపడిన రోజులు ఉన్నాయి. కానీ తాను నమ్మిన సిద్ధాంతం కోసం, ప్రజల కోసం ఒకే ఒక్క మనిషి ఇంతకంటే ఇంకెంత భరించగలడు అని నేను నిరంతరం ఆలోచించేదాన్ని’.

అయినా మేము వెనకడుగు వేయకుండా ముందుకు సాగుతూనే ఉన్నాము. దానివల్ల మా జీవితం లగ్జరీగా, సుఖంగా మారుతుందని కూడా కాదు.. కేవలం కొందరు వ్యక్తులు తమ అంతరాత్మని ఎప్పటికీ వంచించుకోలేరు. బహుశా అందుకేనేమో ఈ విజయం మాకెంతో భావోద్వేగంగా అనిపించింది. ఇది కేవలం రాజకీయపరమైనది కాదు. అంతకుమించిన మానవీయమైనది. ఇన్నేళ్ల మా గుండెకోత, ఒక్క క్షణంలో అంతులేని ఆనందంగా మారిపోయింది. ప్రమాణ స్వీకార మహోత్సవంలో కళ్లల్లో నీళ్లతో నేను అక్కడ నిలబడిన క్షణం నాకు ఇప్పటికీ గుర్తుంది. చివరికి నా కన్నీళ్లని  ప్రధాని మోదీజీ కూడా గమనించారు. అవి  బాధతో వచ్చినవి కావు.   కొన్నిసార్లు దేవుడు మనుషులని  సంవత్సరాల తరబడి కుంగిపోయేలా చేస్తాడు, అవమానిస్తాడు, కఠినంగా పరీక్షిస్తాడు… కానీ చివరికి అదే ప్రపంచం ముందు వారి గౌరవాన్ని అంతకంతకూ రెట్టింపు చేసి సగర్వంగా తిరిగి ఇస్తాడు. 

also read: prakash Raj: ధర్మస్థల కేసులో ప్రకాష్ రాజ్ పేరు.. రెండు రోజుల్లో బాంబ్ పేలుస్తానంటూ నటుడి ఫైర్

ఆ అద్భుత క్షణంలో నాకేమనిపించిందని ఎవరైనా నన్ను అడిగితే.. నాకు కేవలం గర్వంగా అనిపించింది అని మాత్రమే చెబుతాను. ఓటమిని ఒప్పుకోవడానికి అస్సలు ఇష్టపడని ఆ వ్యక్తిని చూసి ఎంతో గర్వపడ్డాను. "నిన్ను చూస్తే చాలా గర్వంగా ఉంది పవన్ కళ్యాణ్’ అంటూ అన్నా లెజినోవా తన మనసులోని మాటలను ఎంతో అద్భుతంగా రాసుకొచ్చారు. ఈ మాటలు మెగా అభిమానులు, జన సైనికులనే కాదు నెటిజన్లని సైతం భావోద్వేగానికి గురిచేస్తున్నాయి. సదరు ట్వీట్ లో  పవన్ ప్రమాణ స్వీకార వీడియో, ఫోటోల్ని  కూడా  అన్నా లెజినోవా షేర్ చేసింది. పవన్ కళ్యాణ్ 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ తో పొత్తు పెట్టుకొని ఘన విజయాన్ని అందుకొని ఇదే రోజు మంత్రిగా ప్రమాణస్వీకారం చేసాడు. అనంతరం ఉప ముఖ్యమంత్రిగా కూడా బాధ్యతలు తీసుకున్నాడు. 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com