Home

»

Latest News

ఓటీటీలోకి సుస్మిత కొణిదెల మూవీ.. ప్రకాష్ రాజ్ పవర్ ఫుల్ మ్యూజికల్ డ్రామా

Aug 20, 2026 4:18PM

 

సుస్మిత కొణిదెల.. నిర్మాతగా మొదటి సినిమాతోనే 'మన శంకర వరప్రసాద్ గారు'తో  తండ్రి చిరు కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ని నిర్మించింది. ఇప్పుడు ఓటిటిలోకి అడుగుపెట్టి మ్యూజికల్ సిరీస్ ‘జగమే సంగీతం’తో  ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.  'కుమారి 21ఎఫ్', '18 పేజెస్' వంటి సూపర్ హిట్ చిత్రాలతో తన ప్రతిభను చాటుకున్న ప్రముఖ దర్శకుడు పల్నాటి సూర్య ప్రతాప్ ఈ సిరీస్‌కి  దర్శకత్వం వహించాడు.

 సంగీతం నేపథ్యంగా సాగే ఈ భావోద్వేగాల ప్రయాణంలో బహుముఖ ప్రజ్ఞాశాలి ప్రకాష్ రాజ్, సీనియర్ హీరో శ్రీకాంత్, నటి మధుబాల ప్రధాన పాత్రల్లో నటించి అలరించనున్నారు.  అగ్రగామి ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’ వేదికగా ఈ వెబ్ సిరీస్ సెప్టెంబర్ 4 నుంచి ప్రపంచవ్యాప్తంగా స్ట్రీమింగ్ కానుంది. కేవలం భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా 240కి పైగా దేశాలు మరియు ప్రాంతాలలో ఈ సిరీస్‌ను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు నిర్మాణ సంస్థ అధికారికంగా వెల్లడించింది. ఈ సిరీస్ ఒరిజినల్‌గా తెలుగు భాషలో రూపుదిద్దుకోగా, తమిళ డబ్బింగ్ వర్షన్ తో పాటు ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో ప్రైమ్ వీడియోలో ఏకకాలంలో విడుదల కానుంది. భారతీయ సంప్రదాయ సంగీతమైన కర్ణాటక సంగీత నేపథ్యంతో ఈ కథనం అత్యంత అద్భుతంగా సాగుతుంది.  ఈ వెబ్ సిరీస్ కథాంశం ప్రధానంగా శాస్త్రి (ప్రకాష్ రాజ్) అనే సంగీత దిగ్గజం, ఆయన వద్ద వారసత్వంగా సంగీతాన్ని నేర్చుకున్న మనవడు బాలు చుట్టూ తిరుగుతుంది. తరతరాలుగా వస్తున్న సాంప్రదాయ బంధాలు, కుటుంబంలోని అంతర్గత విభేదాలు మరియు గతంలో కప్పిపుచ్చిన రహస్యాల మధ్య బాలు ఎలాంటి తీవ్రమైన మానసిక సంఘర్షణకు గురయ్యాడనేది ఈ సిరీస్ లో ప్రధానంగా చూపించనున్నారు. 


Also Read: అన్నయ్య వదన్ మాటలపై బ్రహ్మానందం వివరణ ఇదే 


శాస్త్రీయ సంగీత పునాదుల్లో పెరిగిన బాలు, తన తాత గారి వారసత్వాన్ని కాపాడుకుంటూనే, ఆధునిక సంగీత ప్రపంచంలో తన సొంత గుర్తింపును ఎలా వెతుక్కున్నాడనేది ఈ ఎమోషనల్ డ్రామాలో ఎంతో ఆకట్టుకునేలా ఆవిష్కరించారు. సుమన్, సిజ్జు మేనన్, షఫీ, ఝాన్సీ, రఘు బాబు, రాకెట్ రాఘవ, నాగి జబర్దస్త్, అక్షయ్ లగుసాని, సుస్మితా శెట్టి, ప్రియాంక నల్కారీ, ప్రాతీ ఠాకూర్, రూపా లక్ష్మి తదితర నటీనటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కుటుంబంలో అనుబంధాలు, సంగీత వారసత్వం మరియు భావోద్వేగాల కలబోతగా వస్తున్న ‘జగమే సంగీతం’ ఓటీటీ ప్రియులను, సంగీతాభిమానులను విశేషంగా అలరించడం ఖాయంగా కనిపిస్తోంది. 

Jagamae Sangeetham, Susmitha Konidela, Srikanth, Prakash Raj

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com