
హాస్య బ్రహ్మ బ్రహ్మానందంపై అయన సోదురుడు వదన్ ఇటీవల మాట్లాడుతు మేము ఆరుగురు తోబుట్టువలం. అందులో నలుగురు కాలం చేయగా.. బ్రహ్మానందం, నేను మాత్రమే ఉన్నాం. ‘అన్నయ్యా’ అంటూ బ్రహ్మానందం రెండు మాటలు మాట్లాడితే విందామని ఎదురుచూస్తున్నాను. ఈ వయసులో ఒంటరిగా మిగిలిపోయింది నేనో నొక్కడినే. ఎప్పుడైనా ఫోన్ చేసి “అన్నయ్యా.. ఎలా ఉన్నావ్?” అని అడుగుతాడేమో అని ఆశగా ఎదురుచూస్తున్నా. గొప్పవాళ్లు పలకరిస్తే చిన్నవాళ్లకు ఎంతో సంతోషంగా ఉంటుంది. తమ్ముడి నుంచి ఒక్క ఫోన్, ఒక్క పలకరింపు కోసం ఈ వృద్దాప్యంలో ఎదురుచూస్తున్నా.. అంటూ వదన్ చెప్పాడు.
బ్రహ్మానందం ఈ మాటలపై మీడియాతో మాట్లాడుతు 'అన్నయ్య వదన్..మానసికంగా బలహీనంగా ఉన్నారు. ఎవరో ఒక యూట్యూబర్ మాట్లాడించడంతో అలా మాట్లాడారు .. ఆ వీడియోనే ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. నా అన్నయ్యకి, కుటుంబానికి చాలా సాయం చేశానని బ్రహ్మానందం చెప్పకొచ్చారు. ఆయన చెప్పినట్టుగానే బ్రహ్మానందం తన అన్నయ్య కూతుళ్ళని తన కూతుళ్లుగా భావించి తన సొంత డబ్బుతో పెళ్లిళ్లు చేయడంతో పాటు అన్నయ్య కి ఇల్లు కూడా కట్టించాడు. ఈ విషయాలన్నీ వదన్ ఒక ఇంటర్వ్యూ లో చెప్పాడు.
Also Read: దర్శన్ ప్రియురాలు పవిత్ర మాజీ భర్త మృతి
Brahmanandam, Tollywood, Telugu Cinema






