Home

»

Latest News

'ఇసకపట్నం' ట్రైలర్.. కన్న తండ్రికే సవాలుగా మారిన కూతురు!

Jun 27, 2026 5:40PM

ప్రైమ్ వీడియో తమ కొత్త తెలుగు ఒరిజినల్ క్రైమ్ థ్రిల్లర్ 'ఇసకపట్నం' (Isakapatnam) ట్రైలర్‌ను విడుదల చేసింది. కల్పిత పోర్ట్ టౌన్ నేపథ్యంలో సాగే ఈ కథలో అధికారం, రాజకీయాలు, గ్యాంగ్ వార్స్, కుటుంబ విభేదాలు ప్రధానాంశాలుగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా తండ్రి-కూతురు మధ్య జరిగే పోరు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది.

ఈ సిరీస్‌లో సముద్రఖని నాయుడు పాత్రలో, ఐశ్వర్య రాజేష్ భారతి పాత్రలో నటించారు. పట్టణంలో రాజకీయాలు, నేరాలు, వ్యాపారాలపై పూర్తి ఆధిపత్యం చెలాయించే నాయుడికి, తన సొంత కూతురే పెద్ద సవాలుగా మారుతుంది. తన జీవితాన్ని తన నిర్ణయాలతో ముందుకు తీసుకెళ్లాలనుకునే భారతి, తండ్రికి ఎదురు నిలబడటంతో కథ ఉత్కంఠభరితంగా సాగుతుంది.

గ్యారీ బీహెచ్ దర్శకత్వం వహించిన ఈ 7 ఎపిసోడ్‌ల సిరీస్‌కు ప్రశాంత్ రాఘతి కథ అందించగా, తాజుద్దీన్ సయ్యద్ డైలాగ్స్ రాశారు. తమడా మీడియా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాహుల్ తమడా, సైదీప్ రెడ్డి బొర్రా నిర్మించారు.

ఈ సిరీస్‌లో సునీల్, నరేష్ అగస్త్య, మెరిన్ ఫిలిప్, సుధాకర్ కోమాకుల, రాజీవ్ కనకాల, మైమ్ గోపీ, రోహిణి, బెనర్జీ, జ్వాల కోటి, రవి వర్మ, రాజా చెంబోలు తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

జూలై 2 నుంచి ప్రైమ్ వీడియోలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. అలాగే 15 భాషల్లో సబ్‌టైటిల్స్‌తో భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా 240కు పైగా దేశాలు, ప్రాంతాల్లో అందుబాటులోకి రానుంది.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com