Home

»

Latest News

బాక్సాఫీస్ వద్ద బుడ్డోడు కలెక్షన్ల సునామీ.. చిదంబరం హ్యాట్రిక్ హిట్

Jun 27, 2026 6:14PM

 


కంటెంట్ ని మాత్రమే నమ్ముకొని మలయాళ చిత్ర పరిశ్రమ నుంచి వచ్చే వినూత్న చిత్రాలకి  ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 'జాన్ ఎ మ్యాన్', 'మంజుమ్మెల్ బాయ్స్' వంటి ఇండస్ట్రీ హిట్ చిత్రాలతో సంచలనం సృష్టించిన దర్శకుడు చిదంబరం ఈ నెల 19 న   సరికొత్త ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ 'బాలన్: ది బాయ్' (Balan: The Boy) రూపంలో బాక్సాఫీస్ వద్ద మరోసారి మ్యాజిక్ క్రియేట్ చేశాడు. కేవలం ఒక తల్లి మరియు ఆమె కుమారుడి చుట్టూ తిరిగే ఈ హృదయ విదారక కథ ప్రేక్షకుల హృదయాలని  బలంగా తాకడమే కాకుండా, కలెక్షన్ల పరంగా సరికొత్త రికార్డులని  సృష్టిస్తోంది. పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతున్న ఈ చిత్రం కేవలం 8 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 24.17 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి సరికొత్త మైలురాయిని అధిగమించింది.

ఈ సినిమా మొదటి రోజు రూ. 1.82 కోట్ల నెట్ కలెక్షన్లతో సాధారణంగానే ప్రారంభమైనప్పటికీ, ఆ తర్వాత అద్భుతమైన మౌత్ టాక్ కారణంగా శని, ఆదివారాల్లో పుంజుకుంది. రెండవ రోజు 29.1 శాతం వృద్ధితో  2.35 కోట్లు సాధించగా, మూడవ రోజైన ఆదివారం ఏకంగా 27.7 శాతంతో 3.00 కోట్ల సింగిల్ డే రికార్డు కలెక్షన్‌ను నమోదు చేసింది. మొదటి వీకెండ్ ముగిసేసరికే భారతదేశంలో నెట్ వసూళ్లు 7.17 కోట్లకు చేరాయి. ఆ తర్వాత వర్కింగ్ డేస్‌లో స్వల్పంగా తగ్గినప్పటికీ, రెండవ వారంలోకి అడుగుపెడుతూనే బాక్సాఫీస్ వద్ద మళ్లీ ఊపందుకుంది. ఎనిమిదవ రోజైన శుక్రవారం ఏకంగా 96.9 శాతం వృద్ధితో రూ. 1.93 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది. కేరళ బాక్సాఫీస్ ఈ చిత్రానికి అతిపెద్ద పిల్లర్‌గా నిలిచింది. కేరళతో పాటు కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా ఈ సినిమాకు మంచి ఆదరణ లభిస్తోంది. కేవలం భారతదేశంలోనే కాకుండా ఓవర్సీస్ మార్కెట్‌లోనూ ఈ చిత్రం ప్రభంజనం సృష్టిస్తోంది.దర్శకుడు చిదంబరం ఖాతాలో వరుసగా మూడవ హ్యాట్రిక్ విజయాన్ని ఖాయం చేసినట్టే.

Also read: ప్రియుడు కోసం భర్త బలి.. ఓటిటిలో భయంకరమైన సినిమాలు ట్రెండింగ్  

ముఖ్యమైన క్యారెక్టర్స్ పోషించిన ఫర్జానా పలాతింగల్, చందు సలీమ్‌కుమార్, టోవినో థామస్ నటనకు ఇండస్ట్రీ ప్రముఖుల నుంచి ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే టాలీవుడ్ యువ హీరో నాగ చైతన్య ప్రత్యేక స్క్రీనింగ్‌లో సినిమా చూసి చిత్ర యూనిట్‌ను అభినందించగా, కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కూడా మూవీ చూసి ఒక అద్భుతమైన మణిహారంగా అభివర్ణించారు. రానున్న రోజుల్లో ఈ కలెక్షన్ల జోరు మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 

 


 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com