
'ఇరుముడి'లో కామవాంఛ ఉన్న ఒక ప్రజాప్రతినిధి దగ్గరకి ప్రభుత్వ పాఠశాల టీచర్ విద్యార్థులని పంపిస్తూ ఉంటుంది. థియేటర్ లో ఈ సన్నివేశానికి సంబంధించిన సీన్స్ వస్తుంటే రక్తం మరగని ప్రేక్షకుడు లేడు. మరి ఇలాంటి సంఘటనే నిజ జీవితంలో జరిగితే ఎలా ఉంటుంది పరిస్థితి.
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలు నగరంలో తల్లిదండ్రులు నమ్మి పంపిన బిసి వెల్ఫేర్ హాస్టల్‌లోని అమాయక మైనర్ బాలికలను లక్ష్యంగా చేసుకుని, ఒక ముఠాలాగా దారుణానికి ఒడిగట్టిన తీరు స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. సరిగ్గా ఇటీవలే విడుదలైన ‘ఇరుముడి’ సినిమా కథను తలపించేలా, నిజ జీవితంలోనూ అత్యంత దారుణమైన కుట్రకు తెగబడటం అందరినీ కలవరపెడుతోంది. విద్యార్థినులకు రక్షణగా నిలవాల్సిన హాస్టల్ సిబ్బందే ఈ ఘోరానికి ప్రధాన పాత్రధారులుగా మారడం పట్ల సర్వత్రా తీవ్ర ఆగ్రహజ్వాలలు వ్యక్తమవుతున్నాయి.
ఈ ఘోరానికి సూత్రధారిగా మారిన జరుగుమల్లి బిసి హాస్టల్ వంటమనిషి శారద, అక్కడి ఇద్దరు బాలికలను లక్ష్యంగా చేసుకుంది. ఇటీవల ఒక బాలిక తండ్రి మరణించడంతో, ఆ కుటుంబానికి రావాల్సిన డెత్ సర్టిఫికెట్ ఇప్పిస్తానంటూ ఆమెకు మాయమాటలు చెప్పింది. డెత్ సర్టిఫికెట్ ఇప్పిస్తానని, డీఆర్‌డీఏ (DRDA) శాఖలో పనిచేసి రిటైర్ అయిన వెంకట్రావు వద్దకు వెళితే పని త్వరగా పూర్తవుతుందని నమ్మబలికింది. ఆ విధంగా ప్రణాళిక ప్రకారమే ఆ ఇద్దరు తొమ్మిదో తరగతి విద్యార్థినులను హాస్టల్ నుంచి బయటకు తీసుకువచ్చి, నిందితుడైన రిటైర్డ్ ఉద్యోగి వెంకట్రావు సెల్ నంబర్ ఇచ్చి అతని ఇంటికి పంపించింది.
రిటైర్డ్ ఉద్యోగి వెంకట్రావు ఇంటికి చేరుకున్న ఆ బాలికలకు మొదట బిర్యానీ తినిపించి ఆశ చూపాడు. ఆ తర్వాత తన నిజస్వరూపాన్ని బయటపెడుతూ, తన సెల్‌ఫోన్‌లో ఉన్న నీలిచిత్రాలు (పోర్న్ వీడియోలు) చూపిస్తూ వారిపట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం ప్రారంభించాడు. పరిస్థితి ప్రమాదకరంగా మారుతోందని, ఆ వృద్ధుడి ప్రవర్తనలో తేడా ఉందనే విషయాన్ని సమయస్ఫూర్తితో గ్రహించిన ఒక 9వ తరగతి బాలిక, తన స్నేహితురాలితో కలిసి అత్యంత చాకచక్యంగా అక్కడ నుంచి బయటపడి తప్పించుకుంది.
అక్కడ నుంచి బయటకు వచ్చిన ఆ బాలికలు భయంతో ఒంగోలులోని ఒక స్థానిక పార్కులో కొంతసేపు గడిపారు. కానీ, సాయంత్రం వేళ మళ్లీ ఆ కామాంధుడి వద్దకే వెళ్లాల్సి రావడంతో నిందితుడు వెంకట్రావు మరలా వారిపై పాశవికంగా విరుచుకుపడి అసభ్యకరంగా ప్రవర్తించాడు. అయితే, బాలికలు ధైర్యం కోల్పోకుండా అత్యంత సమయస్ఫూర్తితో వెంటనే తమ ఫోన్ ద్వారా 112 అత్యవసర నంబర్‌కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వడమే కాకుండా తమ బంధువులకు కూడా విషయాన్ని తెలియజేశారు. 112 అత్యవసర హెల్ప్‌లైన్ నంబర్ నుండి సమాచారం అందుకున్న వెంటనే ఒంగోలు పోలీసులు వేగంగా స్పందించారు. స్థానిక టూటౌన్ పోలీసులు నిందితుడి ఇంటిపై దాడి చేసి, రిటైర్డ్ ఉద్యోగి వెంకట్రావును అదుపులోకి తీసుకున్నారు. ఆయనపై కఠినమైన పోక్సో (POCSO) చట్టం కింద కేసు నమోదు చేసి స్టేషన్‌కు తరలించి విచారణ ప్రారంభించారు.
ఇది కూడా చదవండి: నాని పర్మిషన్ తోనే వచ్చారా? శ్రీకాంత్ ఓదెలపై మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్!
.webp)
ఈ సంఘటన కలకలం రేపడంతో బిసి వెల్ఫేర్ అధికారి ఎస్.నిర్మల జ్యోతి, జరుగుమల్లి తహశీల్దార్ కె.వెంకటేశ్వరరావు వెంటనే హాస్టల్‌ను సందర్శించి పూర్తిస్థాయి విచారణ చేపట్టారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించి బాలికలను బయటకు పంపిన వంటమనిషి శారదను విధుల నుంచి తక్షణమే తొలగించడమే కాకుండా, నిర్లక్ష్యంగా ఉన్న హాస్టల్ వార్డెన్ తెరెజమ్మపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నారు. జరుగుమల్లి ఎస్‌ఐ భాగ్యరాజ్ నేతృత్వంలో వీరిద్దరినీ కూడా విచారణ కోసం ఒంగోలుకు తరలించారు. హాస్టళ్లలో భద్రతపై సమగ్ర విచారణకు అంతర్గత కమిటీ వేసినట్లు అధికారులు వెల్లడించారు. బాలికల సమయస్ఫూర్తి, 112 నంబర్‌కు కాల్ చేసే అవగాహన వారిని పెద్ద ప్రమాదం నుండి కాపాడాయి.
Irumudi style Ongole Retired Employee Hostel Girls incident, Irumudi Scenes, Irumudi, Ongloe, Raviteja, telugu Cinema News, Telugu Cinema, Tollywood Cinema News, Tollywood






