
తెలుగు సినిమా గర్వపడే నటుడు కలెక్షన్ కింగ్, నట ప్రపూర్ణ మోహన్ బాబు. తెలుగు సినిమా ఉన్నంతకాలం ఆ నట ప్రవాహ శైలి కొనసాగుతూనే ఉంటుంది. అడ్డుకట్ట వెయ్యాలని చూసినా అసాధ్యం. ఈ విషయాన్నీ మరో సారి ప్యారడైజ్ తో నిరూపించాడు. 'శికంజా మాలిక్' అనే క్రూరమైన క్యారక్టర్ లో చించి పడేసాడని చెప్పవచ్చు.
ఇటీవల జరిగిన 'ది ప్యారడైజ్' ప్రెస్ మీట్ మరియు సక్సెస్ మీట్ వేదికగా శ్రీకారం చుట్టిన ఈ ఆసక్తికర విశేషాలు అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ప్రెస్ మీట్‌లో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తనదైన నైజంతో బహిరంగంగా, స్పష్టంగా మాట్లాడుతూ చేసిన సరదా వ్యాఖ్యలు సినీ అభిమానులలో పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. శ్రీకాంత్ ఓదెల తన వద్దకు వచ్చి కథ చెప్పిన సమయంలో జరిగిన ఒక ఆసక్తికర సంఘటనను మోహన్ బాబు సరదాగా పంచుకున్నారు. శ్రీకాంత్ వినయంగా కథ వివరించిన తర్వాత, "కథ అంతా బాగానే ఉంది కానీ, హీరో నాని కదా... నానిని అడిగే నా దగ్గరకు వచ్చావా అని అడిగాను" అని మోహన్ బాబు పేర్కొన్నారు. దానికి శ్రీకాంత్ ఓదెల చాలా ఆప్యాయంగా "మా నాని అన్న పర్మిషన్ తీసుకునే మీ వద్దకు వచ్చానండి" అని చెప్పడంతో మోహన్ బాబు మనసులో ఒక్కసారిగా ఈగో దెబ్బతిన్నంతగా అనిపించిందట! "ఏంటి, నన్ను ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం పెట్టుకోవడానికి నాని రికమెండేషన్ తో వచ్చావా?" అని అనుకున్నానని మోహన్ బాబు నవ్వుతూ గుర్తు చేసుకున్నారు. అయితే, "ఏదేమైనా నాని అన్న పర్మిషన్ తీసుకొని వచ్చాడు కాబట్టి.. థాంక్యూ నాని" అంటూ వేదికపై మోహన్ బాబు చెప్పిన ఈ వ్యాఖ్యలు ప్రెస్ మీట్‌లో ఉన్నవారందరినీ విశేషంగా నవ్వించాయి. అంతటితో ఆగకుండా, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ప్రతిభను మోహన్ బాబు విపరీతంగా ప్రశంసించారు.
ఇది చదవండి: పాన్ ఇండియా సినిమా అప్పుడే ఉందా? ఈ నిజాలు తెలిస్తే షాక్ అవుతారు!
ఒకప్పుడు సీనియర్ దర్శకుడు దాసరి నారాయణరావు గారిపై నిర్మాతలు ఎలాంటి అపారమైన నమ్మకాన్ని ఉంచేవారో, అదేవిధంగా ఈ చిత్ర నిర్మాత సుధాకర్ చెరుకూరి కూడా దర్శకుడు శ్రీకాంత్‌పై పూర్తి విశ్వాసాన్ని ఉంచి ఈ భారీ ప్రాజెక్టును అప్పగించారని గుర్తుచేశారు. సెట్స్‌లో శ్రీకాంత్ ఒక సీన్ తీసే సమయంలో నటుల నుంచి తనకు కావలసిన విద్వత్తును ఎలా రాబట్టుకుంటాడో, ప్రతి సన్నివేశంలో ఎంత కోపం కనబరచాలో, ఎలాంటి ఎమోషన్ చూపించాలో సూక్ష్మంగా వివరిస్తూ నటులలోని ఉత్తమ నటనను బయటకు తీస్తాడని మోహన్ బాబు వ్యాఖ్యానించారు. అలాగే నాని నటనా విశ్వరూపాన్ని కొనియాడుతూ, కేవలం డాన్సులు మాత్రమే చేసే కొంతమంది నటుల కంటే నాని నవరసాలు పండించగల నిజమైన ప్రతిభావంతుడని, అతని నటన చూసి ఎంతో గర్వపడుతున్నానని కొనియాడారు.

14 ఏళ్ల జైలు శిక్ష తర్వాత తెగబడే జడల్ పాత్రలో నాని నటన థియేటర్లలో ప్రేక్షకులకు మైండ్ బ్లాక్ అయ్యే సీట్ ఎడ్జ్ అనుభూతిని ఇస్తోంది. దాదాపు 175 నిమిషాల నిడివితో కూడిన ఈ భారీ యాక్షన్ డ్రామాలో నాని మరియు మోహన్ బాబుల ముఖాముఖి సీన్లు ఎపిక్ లెవెల్లో డిజైన్ అయ్యాయి. ఈ కామెంట్స్, వెనుక ఉన్న సినిమా విశేషాలు కలసి ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతూ 'ది ప్యారడైజ్' క్రేజ్‌ను మరింత ఆకాశానికి ఎత్తేస్తున్నాయి.
[Mohan babu comments on srikanth odela nani the paradise, The Paradise Movie, Mohan Babu Comments, Nani The Paradise, telugu Cinema News, Telugu Cinema, Tollywood Cinema News, Tollywood]






