
సినిమాతో పాటు సినీ ప్రేక్షకులకి అప్ డేట్ అంటే ఏంటో తెలియని రోజుల్లోనే అప్ డేట్ సినిమాలు తీసిన దర్శకుడు శంకర్. శంకర్ అప్ కమింగ్ మూవీ ప్రదర్శిస్తున్న ట్రైలర్ చూడటం కోసమే ఒక సినిమాని రిపీట్ గా చూసిన ప్రేక్షకులు ఉన్నారు. కానీ ఇప్పుడు మాత్రం డిజాస్టర్స్ ని అందిస్తూ అభిమానులు, ప్రేక్షకులని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు. కానీ ఇప్పుడు ఇండియన్ 3 తో థట్ ఈజ్ శంకర్ అనిపించాలనే పట్టుదలతో ఉన్నాడు.
అయితే, ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి తాజాగా సౌత్ సినీ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్న వార్త హాట్ టాపిక్‌గా మారింది. గతంలో భారీ అంచనాల మధ్య విడుదలైన 'ఇండియన్ 2' చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడం, 300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కికేవలం 148 కోట్ల వసూళ్లతో నిరాశపరచడం తెలిసిందే. ఈ నేపథ్యంలో 'ఇండియన్ 3' పై నిర్మాతలు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి దాదాపు 75 శాతం మేర షూటింగ్ పూర్తయినట్లు సమాచారం. అయితే, సినిమాను మరింత మెరుగ్గా తీర్చిదిద్దేందుకు దర్శకుడు శంకర్ మరో 25 రోజుల పాటు అదనపు షూటింగ్ జరపాలని ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షాన్స్‌ను కోరినట్లు తెలుస్తోంది. కానీ, 'ఇండియన్ 2' ఫలితం కారణంగా భారీ నష్టాలని చవిచూసిన లైకా ప్రొడక్షన్స్ ఈ ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే అందుబాటులో ఉన్న ఫుటేజ్ సినిమాని పూర్తి చేయడానికి సరిపోతుందని, దీనికోసం అదనంగా కోట్లు ఖర్చు పెట్టి మళ్లీ షూటింగ్ చేయాల్సిన అవసరం లేదని నిర్మాతలు భావిస్తున్నట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: నా బట్టలు, నా శరీరం, నా ఇష్టమంటున్న ప్రముఖ హీరోయిన్: వాళ్ళకి సిగ్గుండాలి!

సేనాపతి పూర్వ చరిత్రని , ముఖ్యంగా వీరశేఖర బచారామ్ కథని ఆధారంగా చేసుకుని ఈ మూడో భాగాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ప్రధాన భాగం షూటింగ్ పూర్తి కావడంతో పాటు, మిగిలిన పోస్ట్ ప్రొడక్షన్ మరియు గ్రాఫిక్స్ పనులను త్వరగా ముగించి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.'వార్ మోడ్' అంటూ ఇటీవల చిత్ర యూనిట్ పోస్టర్లను విడుదల చేయడంతో సినిమాపై అంచనాలు మళ్లీ పెరిగాయి. అయితే, శంకర్ కోరినట్లు అదనపు షూటింగ్ రోజులు కేటాయించకుండా, ఉన్నంతలో సినిమాని ఎలా ఫినిష్ చేస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. గత చిత్రాల అనుభవాల దృష్ట్యా ఈసారి ఎలాంటి రిస్క్ తీసుకోవడానికి నిర్మాతలు సిద్ధంగా లేరని తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ, భారీ అంచనాల మధ్య వస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ ఎంతవరకు ప్రేక్షకులను మెప్పిస్తుందో వేచి చూడాలి. ఉలయనాయగన్ కమల్ హాసన్ నట విశ్వరూపం చూడటానికి ఫ్యాన్స్, ప్రేక్షకులైతే ఫుల్ వెయిటింగ్.
[Indian 3 Shankar Proposal Rejected, Indian 3, Kamal Haasan, Shankar, Lyca Productions, Indian 2 box office, Senapathy, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]






