Home

»

Latest News

ఫౌజీ క్రేజ్ పవన్ కి తప్పదా!.. ఇదంతా ఆ హీరోయిన్ వల్లనే!

Feb 09, 2026

 

 

-పవన్ నెక్స్ట్ సినిమాకి ప్రభాస్ ఫౌజీ కి సంబంధం ఏంటి!
-సురేందర్ రెడ్డి ప్రీ ప్రొడక్షన్ పని ఎంత వరకు వచ్చింది.
 -ఇమాన్వి ఇస్మాయిల్ మరో భారీ ఆఫర్ దక్కించుకుందా!
-అదే నిజమైతే జరిగేది ఇదేనా!


ఒక్కో హీరోయిన్ ది ఒక్కో టైం. ఆ టైం వచ్చినపుడు సదరు హీరోయిన్ ని ఆపడం ఎవరి తరం కాదు. తమ సినిమాలో బుక్ చేసుకున్న మేకర్స్ సైతం సెకండ్ ఒపీనియన్ కి వెళదామనే ఆలోచన కూడా చెయ్యరు. టైం కి అంత అతీంద్రియ శక్తులు ఉన్నాయి. ఇప్పుడు ఆ శక్తులన్నీ ఇమాన్వి ఇస్మాయిల్‌(Imanvi Ismail)కి వచ్చినట్టుగా అనిపిస్తుంది. రీసెంట్ గా ఈ అమ్మడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) సరసన ఛాన్స్ దక్కించుకుందనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి మనం కూడా సదరు వార్తల పూర్తి డీటెయిల్స్ చూద్దాం.

 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన నెక్స్ట్ మూవీని సురేందర్ రెడ్డి(Surendar Reddy)దర్శకత్వంలో చేస్తున్న విషయం తెలిసిందే. పవన్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో దేశ భక్తి నేపథ్యంలో తెరకెక్కబోతుందనే టాక్ ఆల్రెడీ ఉంది. పవన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలబడాలనే లక్ష్యంతో పవన్ ఫ్రెండ్  రామ్‌ తాళ్లూరి నిర్మిస్తున్నాడు.ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ దశలో ఉంది. ఈ చిత్రంలో హీరోయిన్ గా ఇమాన్వి ని ఫిక్స్ చేసారని, త్వరలోనే అధికార ప్రకటన రానుందనే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఇప్పుడు ఈ న్యూస్ సోషల్ మీడియాలో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న న్యూస్ గా మారింది. ఇందుకు కారణం కూడా లేకపోలేదు. ఇమాన్వి ప్రస్తుతం పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas)తో 'ఫౌజీ'(Fouji)చేస్తుంది. సదరు ప్రాజెక్ట్ ఎంత ప్రెస్టేజియస్ట్ ప్రాజెక్ట్ నో అర్ధం చేసుకోవచ్చు. పైగా ప్రభాస్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో నిర్మాణం జరుపుకుంటుంది. మరి ఆ వెంటనే ఏ మాత్రం గ్యాప్ లేకుండా పవన్ తో జోడి కట్టే ఛాన్స్ వచ్చిందని వినిపిస్తుండటంతో సదరు న్యూస్ కి ప్రాధాన్యత పెరిగింది.


also read: డబ్బు అవసరం కాబట్టే చేశాను.. నిజం ఒప్పుకున్న సీనియర్ నటీమణి 


సినీ విశ్లేషకులు సైతం ఈ విషయంపై స్పందిస్తు ఇమాన్వి కనుక పవన్ తో జోడి కట్టడం పక్కా అయితే తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఇమాన్వి నెంబర్ వన్ హీరోగా జెండా పాతడం ఖాయం. ఆ సత్తా ఆమెకి ఉంది.పైగా ఫౌజీ క్రేజీ ని కూడా పవన్ మూవీకి ఇమాన్వి ఫ్రీగా ఇచ్చినట్లవుతుందని అంటున్నారు. ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకున్న ఇమాన్వి  సిల్వర్ స్క్రీన్ పై కూడా  ఆ స్థాయి చరిష్మా ని అందుకోవడమే ఖాయమనే నమ్మకం అభిమానుల్లో ఉంది.  

 

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com