సినీ నటి హేమకి కోర్టులో బిగ్ రీలీఫ్
on Jan 2, 2025
గత సంవత్సరం బెంగళూరులో జరిగిన ఒక రేవ్ పార్టీలో ప్రముఖ సినీ నటి హేమ(hema)డ్రగ్స్ తీసుకుందని బెంగుళూర్ పోలీసులు ఆరోపణలు చేసిన విషయం రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే.నేను డ్రగ్స్ తీసుకోలేదని హేమ ఎన్నో వీడియోలలో కూడా చెప్పింది.కానీ ఆమె డ్రగ్స్ సేవించిందని బెంగుళురు పోలీసులు నోటీసులు కూడా జారీ చేశారు.
దీంతో హేమ బెంగుళురు హైకోర్టులో ఒక పిటిషన్ వెయ్యడం జరిగింది.తనపై నమోదైన డ్రగ్స్ కేస్ కొట్టివేయ్యాలని,తాను డ్రగ్స్ సేవించినట్లు ఎలాంటి ఆధారాలు లేవని సదరు పిటిషన్ లో ఆమె పేర్కొంది.ఇప్పుడు ఈ కేసులో బెంగళూరు హైకోర్టు స్టే విధిస్తు తీర్పుని ఇవ్వడంతో హేమకి పెద్ద రిలీఫ్ వచ్చినట్లయింది.
Also Read