Home

»

Latest News

Hello Bachhon Webseries Review: హలో బచ్చో వెబ్ సిరీస్ రివ్యూ

Mar 11, 2026

 

వెబ్ సిరీస్ : హలో బచ్చో
నటీనటులు: వినీత్ కుమార్ సింగ్, విక్రమ్ కొచ్చర్, అనుమెహ జైన్, పంకజ్ కష్యప్, చిత్రాంష్ రాజ్, గిరిజ ఓక్
ఎడిటింగ్: ఆకాశ్ బుంధూ
మ్యూజిక్: ఆనంద్ బాజ్ పాల్
సినిమాటోగ్రఫీ: అమోఘ్ దేశ్ పాండే
నిర్మాతలు: కార్తీక్ భట్, అక్షిత్ గ్రోవర్
దర్శకత్వం: ప్రతీష్ మెహతా
ఓటీటీ: నెట్ ఫ్లిక్స్

కథ: 

అలఖ్ పాండే (వినీత్ కుమార్ సింగ్) అలహాబాద్ కి చెందిన ఓ యువకుడు. మిడిల్ క్లాస్ కుటుంబానికి చెందిన ఈ యువకుడు చదువులలో మొదటి నుంచి మంచి ప్రతిభను కనబరుస్తాడు. అయితే తాను ఎంచుకున్న మార్గంలో ముందుకు వెళ్లడానికి ఆయన ఎన్నో కష్టాలను పడవలసి వస్తుంది. ఎన్నో అవరోధాలను ఎదుర్కోవలసి వస్తుంది. విద్యా వ్యవస్థలోని సమస్యలు ఆయనను ఎంతో ప్రభావితం చేస్తాయి. అందుకోసమే 'ఫిజిక్స్ వాలా'గా అన్ని ప్రాంతాలలోని స్టూడెంట్స్ కి చేరువ కావడం మొదలు పెడతాడు. 'హలో బచ్చో' అంటూ ఆయన ఆన్ లైన్ క్లాస్ లు మొదలుపెట్టే తీరు పాపులర్ అవుతుంది. ఒకానొక సమయంలో ఆయనకి పెద్ద మొత్తంలో ఫండింగ్ అవసరమవుతుంది. అదే సమయంలో ఆయనకి కుటుంబం వైపు నుంచి, ఇనిస్టిట్యూట్  వైపు నుంచి అనేక సమస్యలు ఎదురవుతాయి. తను అనుకున్న లక్ష్యం వైపు నుంచి తప్పుకోవల్సిన పరిస్థితి ఎదురవుతుంది. అప్పుడు ఆయన ఏం చేశాడు? ఆ అవరోధాలను ఎలా ఎదుర్కొన్నాడనేది మిగతా కథ.

విశ్లేషణ: 

డబ్బు కంటే విలువలు ముఖ్యమని నమ్మిన ఒక అధ్యాపకుడి ప్రయాణమే ఈ 'హలో బచ్చో'. ఈ వెబ్ సిరీస్ మొత్తంగా అయిదు ఎపిసోడ్ లు ఉంటుంది. ఒక్కో ఎపిసోడ్ నిడివి నలభై అయిదు నిమిషాల నుండి యాభై అయిదు నిమిషాల వరకు ఉంటుంది. అలఖ్ పాండే జీవితాన్ని చూపించడంతో పాటు ఒక్కో స్టూడెంట్ పడిన కష్టాలని వారు ఎదుర్కొని ముందుకు వెళ్ళిన తీరు ప్రతీ ఒక్కరికి కనెక్ట్ అవుతుంది. ముఖ్యంగా ర్యాంక్ లు రావాలని తపన పడి పిల్లలని ఒత్తిడికి గురిచేసే ప్రతీ తల్లిదండ్రులకి ఈ సిరీస్ కనెక్ట్ అవుతుంది.

ఈ సిరీస్ మొత్తం ఎంగేజింగ్ గా సాగుతుంది. ఎక్కడా బోర్ కొట్టకుండా స్క్రీన్ ప్లే ని సెట్ చేసుకున్నారు దర్శకుడు. కథని అర్థమయ్యేలా చెప్తూ విద్యార్థి దశలో స్టూడెంట్స్ ఎదుర్కొనే సమస్యలను ఎత్తిచూపుతుంది. సొసైటీలో ర్యాంకుల కోసం, పరువు కోసం వారిని ఒక మిషన్ లాగా చదువుని రుద్దే పేరేంట్స్ కి ఇది ఒక పాఠంలా నిలుస్తుంది. హీరో ధనుష్ నటించిన 'సర్' మూవీ నచ్చిన వారికి ఈ వెబ్ సిరీస్ ఫుల్ గా నచ్చేస్తుంది. అయితే ఇది యథార్థ కథ కావడంతో మరి కాస్త ఎక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. కథలో స్టూడెంట్స్ పాత్రలని చేసినవారు చాలా సహజంగా నటించారు. అలఖ్ పాండేకి కుటుంబం నుండి ఇనిస్టిట్యూట్‌ నుండి చాలా సమస్యలు ఎదురవుతాయి. అయితే వాటిని ఎదుర్కొన్న తీరు బాగుంది. మొదటి నుండి చివరి వరకు ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే తో ముందుకు తీసుకెళ్ళిన దర్శకుడు చివరి ఎపిసోడ్ లో ఆడియన్ కి గుర్తుండిపోయే  ముగింపుని ఇచ్చాడు.

ఈ వెబ్ సిరీస్ ని ఫ్యామిలీ కలిసి చూసేలా మేకర్స్ తీర్చిదిద్దారు. ఒక మంచి ఆశయానికి, సిద్ధాంతానికి మరణం లేదని చాటే సిరీస్ ఇది. సిరీస్ లో ఎక్కడా అసభ్య పదజాలం వాడలేదు. అశ్లీల దృశ్యాలు లేవు. సినిమాటోగ్రఫీ బాగుంది. మ్యూజిక్  ఆకట్టుకునేలా ఉంది. ఎడిటింగ్ నీట్ గా ఉంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. 

నటీనటుల పనితీరు: అలఖ్ పాండేగా వినీత్ కుమార్ సింగ్ సినిమాకి ప్రధాన బలంగా నిలిచాడు. స్టూడెంట్స్ గా చేసిన ప్రతీ ఒక్కరు తమ పాత్రలకి పూర్తి న్యాయం చేశారు. మిగతావారంతా తమ పాత్రల పరిధి మేర నటించారు. 

ఫైనల్ గా : వర్త్ వాచింగ్ వెబ్ సిరీస్.

రేటింగ్ : 2.75 / 5

✍️. దాసరి మల్లేశ్

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com