Home

»

Latest News

Gopichand: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి హిస్టారికల్ మూవీకి హీరోయిన్ ఫిక్స్.. కరెక్ట్ జోడి నేనా!

Mar 11, 2026 12:52PM

 

-శరవేగంగా షూటింగ్ జరుగుతున్న గోపించంద్ కొత్త మూవీ 
-సంకల్పరెడ్డి ఈ సారి హిట్ ఇస్తాడా!
-హీరోయిన్ ఫిక్స్ 

కట్ అవుట్ కి తగ్గ కంటెంట్ పడితే బాక్స్ ఆఫీస్ వద్ద గోపిచంద్(Gopichand)హవా మాములుగా ఉండదు. ఇప్పటి వరకు వచ్చిన హిట్ చిత్రాలకి లభించిన ప్రేక్షక ఆదరణే అందుకు ఉదాహరణ. కొంత కాలంగా గోపి చంద్ ఖాతాలో హిట్ లేదు. దీంతో ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలనే పట్టుదలతో ప్రస్తుతం  విభిన్న చిత్రాల దర్శకుడు సంకల్ప్ రెడ్డి(Sankalp Reddy)తో మూవీ చేస్తున్నాడు. ఇప్పుడు ఈ మూవీకి హీరోయిన్ కన్ఫార్మ్ అయ్యింది. సదరు రోల్ కి సంబంధించిన పిక్స్ కూడా సోషల్ మీడియాని రఫ్ఫాడిస్తున్నాయి. మరి ఆ హీరోయిన్ ఎవరో మనం కూడా చూసేద్దాం.

ఆ హీరోయిన్ ఎవరో కాదు రీతూ వర్మ(Ritu Varma). ఈ మేరకు నిన్న సాయంత్రం మేకర్స్ అధికారకంగా వెల్లడి చేస్తు రీతూవర్మ లుక్ తో పాటు ఆమె పేరు, క్యారక్టర్ కి సంబంధించిన విధి విధానాలు కూడా వెల్లడి చేసారు. ఏడవ శతాబ్దానికి చెందిన సత్యవతి అనే  శక్తివంతమైన గిరిజన మహిళగా చేతిలో విల్లంబు ధరించి బాణాన్ని ఎక్కుపెడుతుంది. దీంతో ఆమె క్యారక్టర్ ఎంత పవర్ ఫుల్ గా ఉండనుందో అర్ధం చేసుకోవచ్చు. సినిమాపై ఉన్న అంచనాలు కూడా రెట్టింపు అయ్యాయి.

aslo read: Couple Friendly: ఓటిటిలోకి కపుల్ ఫ్రెండ్లీ.. డేట్ ఎప్పుడో తెలిస్తే షాక్ అవుతారు

హిస్టారికల్ యాక్షన్ అండ్ పీరియాడిక్ డ్రామా ఏడవ శతాబ్దాన్ని మన కళ్ళ ముందు ఉంచబోతున్న ఈ మూవీ ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణని జరుపుకుంటుంది. చరిత్రలో దాగి ఉన్న ఒక యదార్ధ సంఘటనని బేస్ చేసుకున్నారన్నది సమాచారం. వీరుడుగా గోపీచంద్ మెస్మరైజ్ చేయబోతున్నాడు. సదరు క్యారెక్టర్స్ కి సంబంధించి ఇప్పటి వరకు వచ్చిన ప్రచార చిత్రాలు అభిమానుల్లో, మూవీ లవర్స్ లో  ఈ సారి గోపీచంద్ ప్రభంజనం సృష్టించడం గ్యారంటీ అనే నమ్మకాన్ని కలిగిస్తుంది. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పై శ్రీనివాస చిట్టూరి(Srinivasa Chitturi)నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. టైటిల్ ప్రకటనతో పాటు రిలీజ్ డేట్ కూడా త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది.   

 


   

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com