
తొలివలపు సినిమాతో హీరోగా పరిచయమైన గోపీచంద్.. ఆ వెంటనే విలన్‌గా మారి తనదైన ముద్ర వేశారు. ఆ తర్వాత మళ్ళీ హీరో అవతారమెత్తి మాస్ ఇమేజ్ సంపాదించుకున్నారు. అయితే గోపీచంద్ ని విలన్‌గా చూడాలని కోరుకునే వారు ఎందరో ఉన్నారు. అయితే ఇప్పుడు ఆయన మళ్లీ విలన్ పాత్రలో కనిపించబోతున్నారనే వార్త ఆసక్తి రేపుతోంది. అది కూడా సాధారణ సినిమా కాదు.. కోలీవుడ్ స్టార్ సూర్యతో తలపడే అవకాశం ఉందట.
సూర్య 49వ సినిమాలో గోపీచంద్ విలన్‌గా నటించనున్నారనేది ప్రస్తుతం వినిపిస్తున్న టాక్. ఈ వార్త నిజమైతే మాత్రం రెండు భాషల ప్రేక్షకులకు మంచి మాస్ కాంబినేషన్ చూసే అవకాశం దక్కుతుంది.
గోపీచంద్ పేరు చెప్పగానే చాలామందికి మొదట గుర్తొచ్చే సినిమాలు ‘జయం’, ‘నిజం’, ‘వర్షం’. ఈ మూడు సినిమాల్లోనూ ఆయన విలన్‌గా అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా ‘వర్షం’లో భద్రన్న పాత్ర ప్రేక్షకులపై బలమైన ముద్ర వేసింది. ఆ తర్వాత ‘యజ్ఞం’ సినిమాతో మళ్ళీ హీరోగా మారి, యాక్షన్ సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. హీరోగా కొనసాగుతున్న గోపీచంద్ మళ్లీ విలన్‌గా నటిస్తారనే వార్త రావడంతో అభిమానుల్లో ఆసక్తి పెరుగుతోంది.

సూర్య 49వ చిత్రానికి దర్శకుడిగా అరుణ్ మాతేశ్వరన్ పేరు వినిపిస్తోంది. ‘DC’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న ఆయన ఈ సినిమాని కోస్టల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కించనున్నారని సమాచారం.
ఇది కూడా చదవండి: ఆద్యను స్టేజ్‌పైకి వద్దన్న రేణు దేశాయ్.. కూతురి విషయంలో ఎందుకలా చేశారు.?
ఈ ప్రాజెక్ట్ ఇంకా అధికారికంగా ప్రకటించకముందే గోపీచంద్ విలన్ పాత్రలో నటించనున్నారనే వార్త బయటకు రావడం ఆసక్తికరంగా మారింది. సూర్యకు ధీటుగా నిలిచే పవర్‌ఫుల్ విలన్ పాత్రను గోపీచంద్ కోసం రూపొందించారనే టాక్ కూడా వినిపిస్తోంది.

ప్రస్తుతం గోపీచంద్ హీరోగా రెండు సినిమాలు చేస్తున్నారు. అందులో సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘భరతవర్ష’ ఒకటి. మరో సినిమా 'సింగ' వెంకట్ దర్శకత్వంలో రూపొందుతోంది.
గోపీచంద్ విలన్‌గా నటిస్తే మాత్రం అది ఆయన కెరీర్‌లో ఆసక్తికరమైన మలుపు అవుతుంది. గతంలో తన విలనిజంతో ప్రేక్షకులను భయపెట్టిన ఆయన.. ఇప్పుడు సూర్యలాంటి స్టార్‌తో స్క్రీన్ షేర్ చేసుకుంటే ఆ పోటీ ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.
మీకు నచ్చవచ్చు:
నీ గూడు చెదిరింది.. ప్రతి పదంలోనూ ఒక విషాదం.. పాటలోని అసలు భావం ఇదే.!
రామాయణ ఎఫెక్ట్.. థియేటర్లలో కొత్త రూల్.. నాన్‌వెజ్ బ్యాన్.!
[Gopichand, Villain Role, Suriya 49, Arun Matheswaran]






