Home

»

Latest News

ధనుష్ 'ఓం' ఫస్ట్ రివ్యూ!..700 టన్నుల ఎర్రచందనం మాయమైతే ఏమైంది?

Nov 18, 2026 10:47AM

'ఓం' మూవీ స్టార్ లైనప్ చూస్తుంటే ఇప్పుడికిప్పడు షో స్టార్ట్ చేస్తున్నామని చెప్పినా కూడా అభిమానులు, ప్రేక్షకులు చలో టూ ఓం మూవీ అంటూ థియేటర్స్ కి దౌడ్ తీస్తారు. అంత క్రేజ్ 'ఓం' సొంతం . ధనుష్, మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి, సాయి పల్లవి, శ్రీ లీల, అమరన్ డైరెక్టర్ రాజ్ కుమార్ పెరియస్వామి.. ఈ లిస్ట్ చాలనుకుంటా! పైన చెప్పుకున్న మాట ఎలాంటి వాస్తు, అక్షర దోషం లేని వాస్తవమని. మరి ఈ మూవీ ఫస్ట్ రివ్యూ చూసేద్దాం.   


ఈ నెల 20 న ప్రపంచవ్యాప్తంగా తమిళ, తెలుగు, హిందీ భాషల్లో భారీ స్థాయిలో విడుదల కాబోతోంది. ధనుష్ కెరీర్‌లో 55వ చిత్రంగా వస్తున్న ఈ సినిమాకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ (CBFC) తాజాగా సెన్సార్ పూర్తి చేసి U/A (UA16+) సర్టిఫికెట్‌ జారీ చేసింది. సుమారు 179 నిమిషాలు అంటే 2 గంటల 59 నిమిషాల భారీ రన్‌టైమ్‌తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుండటం విశేషం.

సెన్సార్ బోర్డు సభ్యులు మరియు ఇండస్ట్రీ వర్గాల నుండి అందుతున్న ఫస్ట్ రివ్యూ ప్రకారం, ఈ సినిమా కథాంశం ఆంధ్రా, తమిళనాడు రాష్ట్రాల సరిహద్దుల్లోని ఎర్రచందనం అడవుల నేపథ్యంలో అత్యంత ఉత్కంఠభరితంగా సాగుతుంది. మమ్ముట్టి ఇందులో బర్మా కార్తీకేయన్ అలియాస్ సియా అనే శక్తివంతమైన గంధపు చెక్కల స్మగ్లింగ్ డాన్‌గా కనిపించనుండగా, అతడికి నమ్మినబంటుగా చెజియన్ అలియాస్ తిరు కుమరన్ క్యారక్టర్ లో  ధనుష్ కనిపిస్తున్నాడు.

 

వీరిద్దరూ కలిసి ఏకంగా 1,000 టన్నుల విలువైన ఎర్రచందనం దుంగలను అక్రమంగా రవాణా చేయడానికి భారీ ప్రణాళిక వేస్తారు. అందులో భాగంగా మొదటి విడతలో 300 టన్నుల సరుకును విజయవంతంగా గమ్యస్థానానికి చేరవేస్తారు. అయితే, మిగిలిన 700 టన్నుల భారీ సరుకు అనుకోకుండా మాయమవడంతో కథలో అసలైన మలుపు తిరుగుతుంది. 700 టన్నుల సరుకు గల్లంతవడంతో రెండు బలమైన మాఫియా గ్రూపుల మధ్య భీకరమైన అంతర్యుద్ధం మొదలవుతుంది. ఈ క్రమంలో తన బాస్ కార్తీకేయన్‌కే తిరు కుమరన్ ఎదురు తిరగడం, అండర్ కవర్ ఆపరేషన్‌లో భాగంగా అసలు దొంగ ఎవరనే కోణంలో కథ నడవడం ప్రేక్షకులకు గూస్‌బంప్స్ తెప్పిస్తుందని ఫస్ట్ రివ్యూ టాక్ వినిపిస్తోంది.

ఇది కూడా చదవండి: ఆకాశంలో ఒక తార ఫస్ట్ రివ్యూ వచ్చేసింది: దుల్కర్ మరో హిట్ అందుకున్నాడా! 

మరోవైపు ఈ హై ప్రొఫైల్ స్మగ్లింగ్ కేసును ఛేదించడానికి ఐపీఎస్ అధికారిణి నిత్యా రెడ్డి పాత్రలో సాయి పల్లవి రంగంలోకి దిగుతారు. ట్రైలర్ మరియు సెన్సార్ రిపోర్ట్స్ ప్రకారం, స్టార్ హీరోల సరసన సాయి పల్లవి తన నటనతో, పవర్‌ఫుల్ యాటిట్యూడ్‌తో స్క్రీన్‌ను శాసించారని తెలుస్తోంది. ఇక ధనుష్ భార్య రోజా పాత్రలో టాలీవుడ్ సెన్సేషన్ శ్రీలీల నటించగా, ప్రముఖ నటుడు నసీరుద్దీన్ షా, రేణు దేశాయ్ కీలక పాత్రల్లో మెరిశారు.   సాంకేతిక అంశాల విషయానికి వస్తే, యువ సంగీత సంచలనం సాయి అభ్యంకర్ అందించిన నేపథ్య సంగీతం సినిమాకు ప్రాణం పోసింది. 

ఎర్రచందనం అడవుల్లో సాగే యాక్షన్ సీక్వెన్స్‌లకు యానిక్ బెన్, కెచ్చా ఖంఫాక్డీ స్టంట్ కొరియోగ్రఫీ, ఎజిల్ అరసు విజువల్స్ సినిమా స్థాయిని పెంచాయి. వాస్తవానికి అక్టోబర్ 16నే విడుదల కావాల్సిన ఈ చిత్రం, పోస్ట్ ప్రొడక్షన్ పనుల కారణంగా నవంబర్ 20కి వాయిదా పడింది. తెలుగు వెర్షన్‌కు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ విడుదల చేస్తుండటం, తమిళ వెర్షన్‌లోనూ దాదాపు 30 శాతం తెలుగు డైలాగులు ఉండటం విశేషం. వింటేజ్ మాస్ ధనుష్‌కు ఇది ఒక బిగ్ కమ్‌బ్యాక్ మూవీగా నిలుస్తుందని ఫస్ట్ రివ్యూ స్పష్టం చేస్తోంది.

మీకు నచ్చవచ్చు:ENE రిపీట్ ఫస్ట్ రివ్యూ!

మీకు నచ్చవచ్చు:రమ్యకృష్ణ మొదటి సంపాదన వైరల్!

 

[Dhanush, Om, Sai Pallavi, mammotty, raj Kumar periya swami, Sreeleela]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com