
కలెక్షన్ల సునామి అంటే ఇది అంటూ రామాయణ వరల్డ్ బాక్స్ ఆఫీస్ వద్ద ఏకఛత్రాధిపత్యాన్ని కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. మరి ఇప్పుడు అదే రామాయణకి దీన్ని కూడా కలెక్షన్ల సునామి అనే అంటారని ఒక సినిమా నిరూపిస్తే బాక్స్ ఆఫీస్ తన హోదా చూసి గర్వపడుతుంది కదు.. ఇప్పుడు అదే జరుగుతుంది.
జపాన్‌కు చెందిన టోహో సంస్థ నిర్మించిన భారీ యాక్షన్ చిత్రం 'గాడ్జిల్లా మైనస్ జీరో' (Godzilla Minus Zero) బాక్సాఫీస్ లెక్కలనే తారుమారు చేస్తూ సరికొత్త చరిత్ర సృష్టించింది. నవంబరు 6న విడుదలైన ఈ చిత్రం, హాలీవుడ్ మరియు వరల్డ్ వైడ్ వైడ్ ఆడియెన్స్‌ని విశేషంగా ఆకట్టుకుంటూ ఏకంగా అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ముఖ్యంగా ఉత్తర అమెరికా బాక్సాఫీస్ వద్ద 'రామాయణ' ని వెనక్కి నెట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది.
ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం.. శుక్రవారం నుంచి ఆదివారం వరకు సాగిన మొదటి వారాంతంలో (Weekend) 'గాడ్జిల్లా మైనస్ జీరో' ఉత్తర అమెరికాలో అద్భుతమైన రీతిలో ఏకంగా 31.6 మిలియన్ డాలర్ల వసూళ్లను రాబట్టింది. 'రామాయణ' మూడు రోజుల్లో 8.7 మిలియన్ డాలర్లను మాత్రమే సాధించి ఐదవ స్థానానికి పరిమితమైంది. అంటే, సరిగ్గా ఇదే వీకెండ్ లెక్కలను బట్టి చూస్తే 'గాడ్జిల్లా' చిత్రం అమెరికాలో 'రామాయణ' కంటే దాదాపు 260% అధిక వసూళ్లను సాధించి సరికొత్త రికార్డు సృష్టించింది.

ఇది కూడా చదవండి: బిగ్ బ్రేకింగ్: రామ్ చరణ్ వ్యాఖ్యలు వైరల్: అంతా రంగస్థలంలోనే ఉందా!
ఈ బాక్సాఫీస్ యుద్ధంలో అత్యంత ఆసక్తికరమైన మరియు చర్చనీయాంశమైన అంశం సినిమాల బడ్జెట్లే. 'రామాయణ' చిత్రం భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందగా.. దానితో పోలిస్తే కేవలం 9% వ్యయంతో, అంటే సుమారు 19 మిలియన్ డాలర్ల బడ్జెట్‌తోనే 'గాడ్జిల్లా మైనస్ జీరో' తెరకెక్కింది. అంటే ఇండియన్ ఎపిక్ బడ్జెట్‌లో పదవ వంతు ఖర్చుతో తయారైన ఈ జపాన్ రాక్షస చిత్రం, వసూళ్లలో మాత్రం హాలీవుడ్ మరియు గ్లోబల్ మార్కెట్లని షాక్‌కి గురిచేస్తుంది.
ప్రపంచవ్యాప్తంగా చూస్తే, ఈ చిత్రం తొలి వారాంతంలో మొత్తం 63 మిలియన్ డాలర్ల భారీ డెబ్యూ కలెక్షన్లను సాధించి గ్లోబల్ బాక్సాఫీస్‌ని సైతం శాసించిందని చెప్పవచ్చు.'తకాషి యమజాకి' దర్శకత్వంలో తెరకెక్కిన గాడ్జిల్లా 2023 నాటి సెన్సేషనల్ హిట్ 'గాడ్జిల్లా మైనస్ వన్' చిత్రానికి సీక్వెల్‌గా వచ్చింది. 1949 నాటి యుద్ధానంతర జపాన్ నేపథ్యంలో సాగే ఈ కథ, కోలుకుంటున్న దేశంపై పడే మరొక పెను ముప్పును ఉత్కంఠభరితంగా చూపించింది.
.webp)
కేవలం జపనీస్ భాషలో ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో విడుదలైనప్పటికీ, ఈ స్థాయిలో కలెక్షన్లు రాబట్టడం చూస్తుంటే 'కంటెంట్' అనేది ఎంత గొప్పదో మరోసారి తెలియచేసింది. అదే విధంగా కాస్త లేట్ అయినా కంటెంట్ ఉంటే కాసులు వాటంతట అవే వస్తాయనే సత్యాన్ని కూడా నిరూపించింది.
మీకు నచ్చవచ్చు: రామాయణ మూవీ రివ్యూ
మీకు నచ్చవచ్చు:సీతాదేవి రోల్ రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్!
[Godzilla Minus Zero Beats Ramayana,Godzilla Minus Zero Collections, Ramayana box office, North America box office, Godzilla vs Ramayana, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]






