
సినిమా పేరు: గరివిడి లక్ష్మి
నటీనటులు: ఆనంది,రాశి,నరేష్, రాగ్ మయూర్, శరణ్య ప్రదీప్, నితిన్ ప్రసన్న తదితరులు
సినిమాటోగ్రఫీ: జె. ఆదిత్య
ఎడిటింగ్: రవితేజ గిరజాల
మ్యూజిక్: చరణ్ అర్జున్
నిర్మాతలు: టి జి విశ్వ ప్రసాద్, క్రితి ప్రసాద్
బ్యానర్: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
రచన,దర్శకత్వం: గౌరీ నాయుడు జమ్ము
రిలీజ్ డేట్ : అక్టోబర్ 17 ,2026
బ్రో, రాజాసాబ్ ప్రొడ్యూసర్ టిజి విశ్వప్రసాద్ నిర్మాణ సారథ్యంలో 'ఆనంది' టైటిల్ రోల్ పోషించిన చిత్రం గరివిడి లక్ష్మి.1990ల్లో బుర్రకథ, జానపద సాంగ్స్ తో తెలుగు ప్రజలని, ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజలని ఉర్రుతలూగించి, ఉత్తరాంధ్ర కళాప్రపంచాన్ని ఏలిన ప్రముఖ కళాకారిణి గరివిడి లక్ష్మి జీవిత కథ ఆధారంగా తెరకెక్కింది. మరి మూవీ ఎలా ఉందో చూద్దాం
కథ
విజయలక్ష్మి ఉరఫ్ లక్ష్మి(ఆనంది)ది ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం జిల్లాలోని గరివిడి. తండ్రంటే చాలా ప్రేమ. కానీ తన ఐదేళ్ల వయసులోనే తండ్రి మరో పెళ్లి చేసుకొని వెళ్తాడు. అందుకు లక్ష్మి తల్లి దేవుడమ్మ(రాశి) నే కారణం. ఆ తర్వాత 12 ఏళ్ళ వయసులో లక్ష్మికి పెళ్లి అవుతుంది. కానీ భర్తకి అంతకు ముందే పెళ్లి అయ్యిందని తెలుసుకొని అతన్ని వదిలేసి తల్లి పెంపకంలోనే పెరుగుతుంది. పెద్దగా చదువు లేని లక్ష్మి ఒక్కసారి పాట వింటే చాలు అవలీలగా అక్షర దోషం లేకుండా పాడుతుంది. మధురమైన తన గాత్రంతో పాట పాడుతుంటే సంగీతంలో ఎంతో నిష్ణాతులైన వాళ్ళు సైతం పొగడాల్సిందే. అలా క్రమక్రమంగా తల్లికి ఇష్టం లేకపోయినా బుర్ర కథ నేర్చుకుంటుంది. బుర్ర కథని కొత్తగా చెప్పాలని కమర్షియల్ పంధాలో సాగే జానపద సాంగ్స్ యాడ్ చేస్తుంది. దీంతో గరివిడి లక్ష్మి నోటి నుంచి వచ్చే పాటలు అంటే ప్రజలు పూనకం వచ్చిన వాళ్ళలాగా ఊగిపోతారు. తన క్యాసెట్స్ కూడా వస్తాయి. రాష్ట్రంలోనే అత్యధిక క్యాసెట్స్ అమ్ముడైన రికార్డు లక్ష్మిదే. సినిమా వాళ్ళు కూడా ఆమె దగ్గరకి వచ్చి ఆమె పాటలు కావాలంటారు. అలాంటి ఆవిడ చివరకి ఒక నిరుపేదగా చిన్న బడ్డీ కొట్టు పెట్టుకొని బతుకుంటుంది. జానపద రంగాన్ని ఏలిన లక్ష్మికి ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? అందుకు కారకులు ఎవరు? ఎవరైనా మోసం చేసారా? ఆ మోసం తాలూకు ఖరీదు ప్రేమనా? నమ్మక ద్రోహమా? అనేదే గరివిడి లక్ష్మి కథ
ఎనాలసిస్
మూవీ మొత్తం ఫస్ట్ నుంచి చివరకి వరకు ఎక్కడా బోర్ కొట్టకుండా సాగింది. నిజజీవిత కథ కావడం, గరివిడి లక్ష్మి గారికి కూడా మూవీ చూపించాల్సి రావడంతో సినిమా ట్రిక్ అనేది ఎక్కడా ఉపయోగించకుండా రియల్ స్టిక్ గానే తీసారనే విషయం ప్రతి సన్నివేశంలో అర్థమవుతూనే ఉంది. ఫస్ట్ హాఫ్ చూసుకుంటే డైరెక్టర్ గా ఎంట్రీ ఇవ్వాలనుకున్న వ్యక్తి తన ప్రొడ్యూసర్ కోరిక మేరకు గరివిడి లక్ష్మి గారిని వెతుక్కుంటూ ఆమె ఊరు రావడం,లక్ష్మి ఫ్రెండ్ ద్వారా కథ ఓపెన్ కావడం బాగుంది. ఆ తర్వాత లక్ష్మి చిన్నప్పటి సీన్స్, తల్లి దేవుడమ్మ( రాశి) మధ్య వచ్చిన సన్నివేశాలు బాగున్నాయి. ఇక పెద్దయ్యాక లక్ష్మి పాటలు పాడటాన్ని ఏదైనా భారీ సందర్భంలో ఎస్టాబ్లిష్ చెయ్యాల్సిందేమో.
బుర్ర కథ నేర్చుకోవడం రాంబాబు( నరేష్) ద్వారా లక్ష్మి బుర్ర కథ బాగా పడుతుందని గరివిడి ప్రజలకి తెలియడం, సత్తిబాబు( రాగ్ మయూర్) తో కలిసి ప్రోగ్రాం ఇవ్వడం బాగుంది. అక్కడ్నుంచి లక్ష్మి, సత్తిబాబు కలిసి ప్రయాణం చేయాలనీ లక్ష్మి నే చెప్పడం. ఈ సందర్భంగా వచ్చిన అన్ని సీన్స్ బాగున్నాయి. ముఖ్యంగా సాంగ్స్ అయితే నెక్స్ట్ లెవెల్. ఇంటర్వెల్ బ్యాంగ్ తో మూవీ నెక్స్ట్ లెవెల్ లో వుండబోతుందనే విషయం అర్ధమవుతుంది. అందుకు తగ్గట్టే సెకండ్ హాఫ్ లో ప్రతి సీన్ వచ్చింది. లక్ష్మి ప్రోగ్రామ్స్ మెయిన్ ఎట్రాక్షన్.ఆ తర్వాత ఒక్కొక్కరిగా తనని మోసం చేస్తున్నారని గ్రహించడం, చిత్రం మూవీలో 'రాను రాను అంటూనే చిన్నదో రాములోరి గుడికొచ్చే చిన్నది సాంగ్' ని సత్తిబాబుతో చూసి తన సాంగ్ కదా అని షాక్ అవ్వడం, ఆడియో క్యాసెట్ కంపెనీ వాళ్ళు చేసిన మోసం, చివరకి తన ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన సత్తిబాబు కూడా చేసిన మోసం సీన్స్ బాగున్నాయి.
కాకపోతే కొంచం సినిమా టిక్ ఉపయోగించి కొంచం గ్యాప్ మోడ్ లో ఎస్టాబ్లిష్ చేస్తే ఫీల్ అనేది బాగా వర్క్ అవుట్ అయ్యేది. అదే విధంగా పెద్ద పెద్ద సినీ ఉద్దండులు సైతం వచ్చి ఉత్తరాంధ్ర కళాకారులని సన్మానించే ప్రాసెస్ లో గరివిడి లక్ష్మికి సన్మానం అని వేరే మహిళని గరివిడి లక్ష్మి గా భావించి సన్మానం చేసే సీన్ బాగున్నా, స్టేజ్ కిందనే ఉన్న నిజమైన గరివిడి లక్ష్మి ఫీల్ అయ్యే ట్రాక్ ని సినిమా ట్రిక్ లోనే మరింతగా ఎస్టాబ్లిష్ చేయాల్సిందేమో . క్లైమాక్స్ కంటతడి పెట్టిస్తుంది.
నటీనటులు సాంకేతిక నిపుణుల తీరు
గరివిడి లక్ష్మి గా ఆనంది పెర్ఫార్మ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ప్రేమ, జాలి,దయ, సంతోషం,ఉత్సాహం, నమ్మక ద్రోహం వంటి పార్శ్యాలు తన జీవితంలోకి ఎదురైనప్పుడు ఆనంది పండించిన హావ భావాలు నభూతో నభవిష్యత్. తన ఎంటైర్ సినీ లైఫ్ లో నా సినీ ఆల్బమ్ లో గరివిడి లక్ష్మి ఉందని సగర్వంగా చెప్పుకోవచ్చు. అంతలా క్యారక్టర్ లో ఒదిగిపోయింది. డాన్స్ లు కూడా ఎక్స్ లెంట్. సత్తిబాబు గా రాగ్ మయూర్ సైతం మెప్పించాడు. మిగతా క్యారెక్టర్స్ లో చేసిన నరేష్, రాశి, శరణ్య తమ క్యారెక్టర్స్ కి నిండు తనాన్ని తెచ్చారు.గౌరీ నాయుడు డైరెక్టర్ గా సక్సెస్ అయ్యాడనే చెప్పవచ్చు . కాకపోతే కొన్ని సీన్స్ లో ఎమోషన్స్ ని సినీ ట్రిక్ లో చూపించాల్సింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ఈ సంస్థ కూడా తన సినీ లైబ్రరీలో గరివిడి లక్ష్మి ఉందని సగర్వంగా చెప్పుకోవచ్చు.
బలాలు
1 . కథ
2 . సాంగ్స్
3 . ఆనందితో పాటు మిగతా నటీనటుల పెర్ ఫార్మెన్స్
4 .డైరెక్షన్
చివరిగా చెప్పుకోవాలంటే అలనాటి నిజమైన 'గరివిడి లక్ష్మి' ని మన కళ్ళ ముందు ఉంచింది.
రేటింగ్ 2 .75 /5
అరుణాచలం






