
అత్యాశ అనే వర్డ్ తప్పని చెప్పలేం. కానీ అత్యాశతో వెయిట్ చేసి అనుకున్నది కుదరక అసలుకే మోసం వస్తే మాత్రం అత్యాశనే మౌనంగా సరైన సమాధానం చెప్తుంది. ఇప్పుడు యష్ వన్ మాన్ షో టాక్సిక్ మేకర్స్ ది అదే పరిస్థితి.
థియేట్రికల్ రిలీజ్ కి ముందు, ప్రముఖ డిజిటల్ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ నుంచి 'టాక్సిక్' ఆల్ లాంగ్వేజ్ పోస్ట్ థియేట్రికల్ స్ట్రీమింగ్ హక్కుల కోసం 150 కోట్ల వరకు ఆఫర్లు వచ్చాయి. అయితే, థియేట్రికల్ బిజినెస్ ద్వారా 450 కోట్ల మైలురాయిని సులభంగా అందుకుంటుందని, ఆ విజయం ఆధారంగా డిజిటల్ హక్కుల ధరను . 200 కోట్లకు పైగా పెంచవచ్చని మేకర్స్ భావించారు. యశ్ కూడా ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టిస్తుందని నమ్మి, 150 కోట్ల ప్రారంభ ఆఫర్‌ను తిరస్కరించినట్లు సినీ విశ్లేషకులు చెబుతున్నారు.
కానీ ఉదయం మొదటి ఆట నుంచే నాకు ఎదురే లేదు అన్నట్టుగా డిజాస్టర్ టాక్ వీరవిహారం చేస్తూ వచ్చింది. ఈ డిజాస్టర్ ఫలితం ప్రభావం ప్రత్యక్షంగా ఓటీటీ రైట్స్ పై పడి గతంలో 150 కోట్లు చెల్లించేందుకు సిద్ధపడిన సంస్థలు ఇప్పుడు తమ ఆఫర్లను పూర్తిగా తగ్గించేశాయి. ప్రస్తుతం జీ5 (Zee5) సంస్థ మాత్రమే ఈ డిజిటల్ హక్కులను సొంతం చేసుకోవడానికి ఆసక్తి చూపుతుండగా, వారు కోట్ చేసిన మొత్తం కేవలం 30 కోట్లు మాత్రమే కావడం గమనార్హం. అంటే, విడుదలకు ముందు చేతివరకు వచ్చి చేజారిన రూ. 150 కోట్లతో పోలిస్తే, మేకర్స్ దాదాపు 120 కోట్ల మేర భారీ నష్టాన్ని చవిచూడాల్సి వస్తోంది.

Also Read: చిరు డాటర్ సుస్మితకి ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్: ఆ పదవిలో నియమిస్తూ ఉత్తర్వులు
పైగా, ఈ చిత్రంలో బోల్డ్ మరియు అడల్ట్ ఓరియంటెడ్ కంటెంట్ ఎక్కువగా ఉండటంతో శాటిలైట్ హక్కుల ద్వారా కూడా పెద్దగా ఆదాయం వచ్చే అవకాశం కనిపిచడం లేదు. ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ నుంచి మెరుగైన ఆఫర్లను పొందడానికి, మేకర్స్ డిజిటల్ స్ట్రీమింగ్ వెర్షన్ కోసం సరికొత్త కట్ (Fresh Edit) తయారు చేయాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. ప్రణాళికల అంచనాలు తప్పి, భారీ రేటు ఆశించడంతో ఒక అగ్ర హీరో సినిమా ఓటీటీ మార్కెట్‌లో ఇన్ని కోట్ల నష్టాన్ని ఎదుర్కొవడం సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.ఇక టాక్సిక్ 12 రోజుల రన్ పూర్తయ్యేసరికి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 337.80 కోట్ల గ్రాస్ మాత్రమే నమోదు చేయగలిగింది.ఇంక వస్తాయనే నమ్మకం లేదు. ఇటీవల ఇంగ్లీష్ లాంగ్వేజ్ రిలీజ్ చేయగా కనీసం ఫోన్ ఖర్చులకి కూడా రాలేదని టాక్.
[Toxic, Ott Deal. yash, TeluguCinema, TeluguCinema News, Tollywood, Tollywood News]






