
తనదైన శైలిలో విభిన్న సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది 'ఫరియా అబ్దుల్లా'. సినిమాలే కాదు అభిమానులు, సోషల్ మీడియా ప్రేమికుల్లో జోష్ నింపుతు ప్రైవేట్ ఫంక్షన్స్ కి కూడా హాజరవుతూ ఉండటంలో కూడా ఫరియా స్పెషలిస్ట్.
ప్రస్తుతం సందీప్ కిషన్, జాసన్ సంజయ్ కాంబోలో తెరకెక్కుతున్న 'సిగ్మా'తో బిజీగా ఉంది. అక్టోబర్ 2 న రిలీజ్ కానుండటంతో ప్రచార కార్యక్రమాలు ఒక రేంజ్ లో జరుగుతున్నాయి. రీసెంట్ గా ఫరియా అబ్దుల్లా కొత్త ఇల్లు కొనుగోలు చేసిందంటూ సోషల్ మీడియాలోనూ, సినీ వర్గాల్లోనూ గత కొన్ని రోజులుగా న్యూస్ ఒకటి హల్‌చల్ చేస్తుంది.కానీ అసలు నిజం ఏంటంటే ఒక విలేకరి ఫరియా అబ్దుల్లా సక్సెస్ రేషియో గురించి కాస్త కఠినమైన ప్రశ్న అడగగా, సందీప్ కిషన్ వెంటనే జోక్యం చేసుకుని 'ఫరియా కేవలం 25 ఏళ్ల చిన్న వయస్సులోనే ఇండస్ట్రీలో ఎన్నో గొప్ప మైలురాళ్లను సాధించింది. ఇప్పటికే ఎన్నో మంచి చిత్రాల్లో నటించి, అవార్డులు అందుకోవడమే కాకుండా, స్వశక్తితో సొంతంగా ఇల్లు, కారు కొనుగోలు చేసి తన తల్లిదండ్రులను చాలా సంతోషంగా చూసుకుంటోందని సందీప్ వెల్లడించారు. అయితే తాజాగా ఈ విషయంపై ఫరియా స్పందిస్తూ 'సందీప్ కిషన్ ఈ ఈవెంట్‌లో నన్ను సమర్థిస్తూ మాట్లాడిన విధానంపై చాలా ఆనందం వేసింది.
ఇది కూడా చదవండి: శ్రీకాంత్ ఓదెల, చిరంజీవి సినిమా ఉంటుందా:ఇదే ఏకైక మార్గం!

కానీ, నేనింకా కొత్త ఇల్లు కొనలేదు. సందీప్ కిషన్ ప్రెస్ మీట్‌లో ఆ మాట చెప్పిన తర్వాతే నాకు కూడా నిజంగానే ఒక కొత్త ఇల్లు కొనుగోలు చేయాలనే బలమైన కోరిక కలిగింది. సందీప్ ఇచ్చిన ఆ కాంప్లిమెంట్ నాలో ఒక కొత్త ఉత్సాహాన్ని నింపింది. త్వరలోనే సొంతంగా మంచి ఇల్లు కొని అతని మాటను నిజం చేస్తానని ఫరియా స్పష్టం చేశారు.






