
పవన్ కళ్యాణ్ vs నాగ చైతన్య.. ఇలా ఇద్దరి మధ్య వర్సస్ అనే వర్డ్ పుట్టుకొస్తుందని ఇరువురి ఫ్యాన్స్ అసలు అనుకోని ఉండరు. కానీ ఏం చేస్తాం, చిత్ర పరిశ్రమ విచిత్ర పరిశ్రమ. ఇక్కడ ఎవరు ఎవరకి చుట్టాలు ఉండరు. ఒక వేళ చుట్టాలు ఉన్నా ఎవరి దారి వాళ్ళది. ఎందుకంటే సినిమా అనేది కళాత్మక, వ్యాపార సామ్రాజ్యం.
అసలు మ్యాటర్ లోకి వస్తే రీసెంట్ గా నాగచైతన్య తన కెరీర్ లోనే ఫస్ట్ టైమ్ ప్రతిష్టాత్మక 'సైమా'(సౌత్ ఇండియన్ ఇంటెర్నేషనల్ మూవీ అవార్డ్స్) అవార్డుని అందుకోవడం జరిగింది. గత 15 ఏళ్ళ నుండి జరుగుతున్న ఈ సైమా అవార్డ్స్ వేడుక ఈ నెల 12 ,13 తేదీల్లో బెంగుళూరులో ఎంతో అట్టహాసం గా జరిగింది. బెస్ట్ యాక్టర్ క్యాటగిరీ లో ఓజీ
చిత్రం నుంచి పవన్ కళ్యాణ్, తండేల్ నుంచి నాగ చైతన్య , కుబేర తరుపు ధనుష్, హిట్ 3 తరపు నాని నామినేట్ అయ్యారు. ఇక అవార్డ్ ఎవరకి వస్తుందో చెప్పక్కర్లేదు. ఓటింగ్ బేస్ కాబట్టి పవన్ కళ్యాణ్ కే వస్తుందని అంతా ఆశించారు. మరి పవన్ కి ఉన్న ఫ్యాన్ బేస్ అలాంటిది.
కానీ ఎవ్వరూ ఊహించని విధంగా నాగ చైతన్య కి అవార్డు దక్కింది. దీంతో సోషల్ మీడియా లో పవన్ కళ్యాణ్ ని ఓడించిన నాగ చైతన్య అంటూ మీమ్స్ ప్రచారం అవుతున్నాయి. ఓటింగ్ ని ఆధారంగా తీసుకొని అవార్డు ఇచ్చేలా ఉంటే కచ్చితంగా పవన్ కళ్యాణ్ గెలవాలి. కానీ అలా జరగకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అయితే సైమా అవార్డ్స్ ఈమధ్య కాలం లో నామమాత్రంగానే ఈ ఓటింగ్ ప్రక్రియ ని కొనసాగిస్తుంది. కానీ వాస్తవం ఏమిటంటే , ఆ సమయం లో నామినేషన్స్ లో ఉన్న హీరోల్లో ఎవరైతే ఈవెంట్ కి హాజరయ్యేందుకు అందుబాటులో ఉంటారో , వాళ్ళకే అవార్డు ని ఇస్తారట. పవన్ కళ్యాణ్ ఎంత బిజీ అనేది ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇక నాని అయితే ప్రస్తుతం ‘ది ప్యారడైజ్’ విడుదల హడావిడి లో ఉన్నాడు. ధనుష్ కూడా అందుబాటులో లేకపోవడంతో , చివరికి నాగ చైతన్య కి ఈ అవార్డు సొంతమైంది.

Also Read: ఆ హీరోపై సంపూర్ణేష్ బాబు వ్యాఖ్యలు వైరల్: ఎంత ప్యారడైజ్ లో చేస్తుంటే మాత్రం!
నిజానికి తండేల్ లో నాగ చైతన్య అద్భుతంగా నటించాడు. ఆయన కెరీర్ లోనే బెస్ట్ యాక్టింగ్. దీంతో చైతన్యకి అవార్డు రావడం పై పవన్ ఫ్యాన్స్ కి కూడా ఎలాంటి అభ్యంతరం లేకపోవడంతో , సోషల్ మీడియా లో పెద్దగా గొడవలు జరగడం లేదు. చైతన్య ప్రస్తుతం ‘వృష కర్మ’చేస్తున్న విషయం తెలిసిందే.
[Pawan kalyan, Naga Chaitanya, Thandel, Og, Siima 2026, Telugu Cinema, Telugu Cinema News, Tollywood Cinema News, Tollywood]






